English | Telugu
Rithu Chowdary Remuneration : రీతూ చౌదరి రెమ్యునరేషన్ ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!
Updated : Dec 8, 2025
బిగ్ బాస్ సీజన్-9 లో పదమూడో వారం ముగిసింది. నిన్నటి ఎపిసోడ్ లో రీతూ చౌదరి ఎలిమినేషన్ అయింది. సంజన , సుమన్ శెట్టిలలో ఎవరో ఒకరు ఎలిమినేట్ అవుతారని అనుకున్నారంతా కానీ బిగ్ బాస్ ఇచ్చిన ట్విస్ట్ తో ఆడియన్స్ కి షాక్ తగిలింది. హౌస్ లో స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా రీతూ ఉంది.
రీతూ ఫస్ట్ వీక్ నుండి నిన్నటి వరకు మొత్తంగా పదమూడు వారాలు హౌస్ లో ఉంది. పదమూడు వారాల్లో తనపై ఉన్న నెగెటివిటీ మొత్తం పోయి ఫుల్ పాజిటివ్ గా మారింది. హౌస్ లోకి వెళ్ళక ముందు చాలా వరకు నెగెటివ్ ఉండేది. అయితే తన ఆటతీరు, మాటతీరుతో ఆడియన్స్ కి చాలా మంచి అభిప్రాయం ఏర్పడింది. అయితే తనకి బిగ్ బాస్ భారీగానే రెమ్యునరేషన్ ఇచ్చినట్టు తెలుస్తోంది. వారానికి రెండున్నర లక్షల చొప్పున రీతూ రెమ్యునరేషన్ అందుకున్నట్లు తెలుస్తుంది. అంటే ముప్పై రెండు లక్షల రెమ్యునరేషన్ తీసుకున్నట్లు తెలుస్తోంది.