English | Telugu

Bigg Boss buzzz Interview: బజ్ ఇంటర్వ్యూలో డీమాన్ పవన్ తో లవ్ ట్రాక్ గురించి నిజం చెప్పిన రీతూ చౌదరి!

బిగ్ బాస్ సీజన్-9 లో పదమూడో వారం రీతూ చౌదరి ఎలిమినేట్ అయింది. అయితే తన ఎలిమినేషన్ కంప్లీట్ గా అన్ ఫెయిర్. ఎందుకంటే తను హౌస్ లో స్ట్రాంగ్ కంటెస్టెంట్. సంజన, సుమన్ శెట్టిల కంటే రీతూ స్ట్రాంగ్.. ఇంకా చెప్పాలంటే భరణి కంటే కూడా బాగా ఆడుతుంది రీతూ. అయినా తనని ఎలిమినేషన్ వెనుక భారీ ప్లానింగ్ వేశాడు బిగ్ బాస్ మామ..

నిన్నటి ఎపిసోడ్ లో సంజన, రీతూల మధ్య జరిగిన ఎలిమినేషన్ రౌండ్ లో రీతూ ఎలిమినేట్ అయింది. ఇక రీతూ ఎలిమినేషన్ తర్వాత బజ్ ఇంటర్వ్యూకి వచ్చింది. ఇందులో శివాజీ అడిగిన ప్రశ్నలకు రీతూ తడబడింది. ఒక్క నిజం చెప్తాను రీతూ.. నువ్వు మ్యాక్సిమమ్ ఎప్పుడైతే ఏడ్చావో.. ఆ టైమ్ లో మాత్రం కన్నీళ్లు రాలేదమ్మాయ్ అని శివాజీ అనగా.. ఏడ్చి ఏడ్చి ఇంకిపోయినయ్ అని రీతూ సమాధానమివ్వగా ఓరి బాబోయ్ అని శివాజీ అన్నాడు. ఆ తర్వాత ప్రశ్నల పరంపర మొదలెట్టాడు. రీతూ గేమ్ మీద కన్నా ఫోకస్ అంతా కూడా డీమాన్ మీద చేయడం వల్ల రీతూ ఎందుకో వెనకపడింది. సారీ డీమాన్ వెంటపడింది. ఇదంతా ఎలా ఉందంటే అమ్మా.. నువ్వు స్ట్రాటజికల్గా ఏడిస్తే.. వాడొచ్చి ఓదారుస్తాడు.. వాడ్ని తిడతావ్.. వాడ్ని తిట్టినప్పుడు నువ్వెళ్లి ఒక మూలన కూర్చుంటావ్.. మళ్లీ పోయిన తర్వాత.. ఇలా ఇదంతా కెమెరా అటెన్షన్ లా అనిపించడం లేదా అని శివాజీ అడుగుతాడు. నాకు ఫస్ట్ హౌస్ లో బాగా కనెక్ట్ అయ్యాడు వాడు. జెన్యున్ గా ఉన్నాడు. మంచివాడిలా అనిపించాడు.‌ వాడు గెలవాలి.. బాగా ఆడాలని రీతూ అంది.

డీమాన్ బయట పరిచయం లేదు..హౌస్ లోనే పరిచయం.. ఇంత తక్కువ టైమ్ లో అంత ట్రూ బాండింగ్ ఆ.. ఏ విషయంలో కనెక్ట్ అయ్యాడు? ఎక్కడ కనెక్ట్ అయ్యాడు? ఎప్పుడు కనెక్ట్ అయ్యాడని గట్టిగా అడిగాడు శివాజీ. నేను అందరితో బాగానే ఉంటాను.. కళ్యాణ్ నేను టామ్ అండ్ జెర్రీ ఫ్రెండ్స్.. ఇమ్మాన్యుయేల్ తో సరదగా ఉంటా.. వాడిని ఆటపట్టిస్తానని రీతూ కవర్ చేయగా.. అందరితో కంటే డీమాన్ తో ఎక్కువగా ఎందుకున్నావ్ అని శివాజీ అడుగుతాడు. నాకు వాడి దగ్గర కంఫర్ట్ ఉంటుంది.. వాడు నన్ను అర్థం చేసుకున్నాడని రీతూ సమాధానమిచ్చింది.

సంజన కోసం హెయిర్ కట్ ఎందుకు చేసుకున్నావ్.. తను డీమాన్ కాదు కదా.. సింపథీ కోసం చేసుకున్నావా అని శివాజీ అనగా.. అదేం లేదు.. తనతో జోక్ లు వేస్తూ, సరదగా ఉండేదాన్ని.. అందులోను మనతో ఉన్న సంజన బయటకి వెళ్తుంటే నచ్చలేదు.‌ త్యాగం చేయాలనిపించి చేశానని రీతూ అంది. మరి డీమాన్ బయటకొచ్చాక నీకు..' ఐ లవ్ యూ' చెప్తే ఏం చేస్తావని శివాజీ అడుగగా.. ఐ లైక్ హిమ్.. తను చాలా జెన్యున్.. తనకి కాబోయే భార్య లక్కీ.. కొన్ని రోజులు అతడితో ట్రావెల్ అయి..నాకు ఏదనిపిస్తే అదే చేస్తానని రీతూ అంది. ఆ తర్వాత హౌస్ మేట్స్ గురించి అడగగా అందరి గురించి పాజిటివ్ గా చెప్పింది రీతూ.‌