English | Telugu
రిజిస్ట్రేషన్ ఆఫీస్ లో వేద, యష్
Updated : Jan 31, 2022
బుల్లితెర వీక్షకుల్ని విశేషంగా ఆకట్టుకుంటున్న సీరియల్ `ఎన్నెన్నో జన్మల బంధం`. గత కొన్ని వారాలుగా ఫ్యామిలీ ఆడియన్స్ ని ఈ సీరియల్ అలరిస్తోంది. నిరంజన్, డెబ్జాని మోడక్ కీలక పాత్రల్లో నటించిన ఈ సీరియల్ ఓ పాప ప్రధానంగా సాగుతూ ఆసక్తికర సన్నివేశాలతో ఆకట్టుకుంటోంది. ఈ సోమవారం ఎపిసోడ్ మరింత ఆసక్తికరంగా సాగబోతోంది. ఆ వివరాలేంటో ఒక సారి చూద్దాం. ఖుషీ కోసం డాక్టర్ వేదని పెళ్లాడేందుకు సిద్ధమవుతాడు యష్.
Also Read:సుమ వల్ల రవికృష్ణకు బ్రేకప్ చెప్పిన నవ్యా స్వామి
ఇదే విషయాన్ని డాక్టర్ వేదకు కూడా చెప్పడంతో కొన్ని షరతుల కారణంగా యష్ తో పెళ్లికి వేద కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తుంది. అయితే వీరి పెళ్లికి యష్ తల్లి మాలిని, వేద తల్లి కూడా అడ్డుచెబుతారు. దీంతో ఏం చేయాలతో అర్థం కాని స్థితిలో వుంటారు. కట్ చేస్తే యష్ .. తన మాజీ భార్య మాళవికకు ఫోన్ చేసి ఖుషీతో మాట్లాడాలని, తన గొంతు వినాలని అంటాడు. కానీ మాళవిక మాత్రం అందుకు అంగీకరించదు. పైగా యష్ పైనే అరుస్తుంది. ఇదే సమయంలో ఖుషీ గురించి మాట్లాడాలని వేద .. యష్ దగ్గరికి వస్తుంది.
Also Read:దీపకు అడ్డంగా దొరికిపోయిన డాక్టర్ బాబు
కట్ చేస్తే యష్, వేద ఇద్దరు కలిసి రిజిస్ట్రేషన్ ఆఫీసుకి వెళతారు. అక్కడ వారి మధ్య కొంత సేపు మాటల యుద్ధం జరుగుతుంది. ఇంటి వద్ద `యష్ - వేద`ల పెళ్లికి మాళిని గ్రీన్ సిగ్నల్ ఇస్తుంది కానీ తాము కాకుండా వేద వాళ్లే తమని అడగాలని షరతు పెడుతుంది. ఇదిలా వుంటే తనకు తన ఖుషీ దగ్గరకాకుండా చేస్తున్న అభిమన్యు - మాళవికలపై యష్ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తాడు. ఫుల్లుగా తాగి అభిమన్యు ఇంటికి వెళ్లి ఛాలెంజ్ చేస్తాడు. యష్ చేసిన ఛాలెంజ్ ఏంటీ? అన్నది తెలియాలంటే ఈ రోజు ఎపిసోడ్ చూడాల్సిందే.