English | Telugu
కాబోయే భర్తను ఫస్ట్ టైం కలిసి సర్ప్రైజ్ చేసిన గుప్పెడంత మనసు సాక్షి...
Updated : Mar 14, 2024
బుల్లితెర మీద "గుప్పెడంత మనసు" సీరియల్ లో సాక్షి రోల్ అందరికీ గుర్తుండే ఉంటుంది. రిషి సర్ ని పెళ్లి చేసుకోవడానికి పెద్ద ప్లాన్ వేసి వసుధారను ఇరకాటంలో పెట్టే వయొలెంట్ రోల్ అది. ఆ క్యారక్టర్ ని చూసి ఆడియన్స్ అంతా బాగా తిట్టుకునేవాళ్ళు. ఆ సాక్షి ఇప్పుడు తనకు కాబోయే ఫియాన్సీ వరుణ్ ని పరిచయం చేసింది. ఫారెన్ లో ఉన్న తనకు కాబోయే అతను హైదరాబాద్ వస్తుండడంతో ఆమె రిసీవ్ చేసుకోవడానికి ఎయిర్ పోర్ట్ కి వెళ్ళింది. అలాగే తనకు వెల్కమ్ చెప్పడానికి తన కార్ లో కొన్ని ఏర్పాట్లు చేసింది. కేక్ రెడీ చేసింది. అలాగే వరుణ్ వాళ్ళ బ్రదర్ అండ్ ఫ్రెండ్స్ ని కూడా ఎయిర్ పోర్ట్ కి పిలిపించింది. ఫైనల్ గా ఆమె బొకే తీసుకెళ్లి అతనికి ఇచ్చి సర్ప్రైజ్ చేసింది. కాసేపు కార్ అక్కడ పెట్టాను ఇక్కడ పెట్టాను అని వరుణ్ ని ఎయిర్ పోర్ట్ లో చాలా దూరం నడిపించింది.. ఐతే వరుణ్ పెద్దగా ఎక్సయిట్ కాకపోయే సరికి ఆమె కొంచెం హార్ట్ ఐనట్టే ఉంది. చివరికి వన్ బై వన్ సర్ప్రైజ్ లు ఇచ్చేసరికి అది చూసి ఫుల్ ఖుషీ ఐపోయాడు. అందరూ కేక్ కట్ చేసి సెలెబ్రేట్ చేసుకున్నారు. ఐతే సాక్షి అసలు పేరు ఏంటంటే రసజ్ఞ రీతూ. ఈమెను ఫ్యామిలీ, ఫ్రెండ్స్ అంతా రీతూ అని పిలుస్తారు. మోడల్ గా కెరీర్ స్టార్ట్ చేసిన రసజ్ఞ...మహానటి, నాటకం, కథనం, రౌడీ బేబీ వంటి కొన్ని షార్ట్ ఫిలిమ్స్ లో చేసింది ఆ తర్వాత లవ్ బర్డ్స్ , రొమాంటిక్ గర్ల్ ఫ్రెండ్ వంటి వెబ్ సిరీస్ లో నటించింది. 'ఆడదే ఆధారం' సీరియల్ తో బుల్లితెర మీదకు ఎంట్రీ ఇచ్చిన రసజ్ఞ 'నా పేరు మీనాక్షి' 'గుప్పెడంత మనసు', 'రావోయి చందమామ', 'ఇంటికి దీపం ఇల్లాలు', మౌనపోరాటం వంటి సీరియల్స్ లో నటించింది. అలాంటి రసజ్ఞ రీసెంట్ గా ఇండస్ట్రీ నుంచి క్విట్ ఐపోయింది.