English | Telugu
రాహుల్ సొంతింటి కల నెరవేరింది!
Updated : Aug 23, 2022
రాహుల్ సిప్లిగంజ్ ఎన్నో సూపర్ హిట్ మూవీస్ లో సాంగ్స్ పాడి ఫుల్ ఫేమస్ అయ్యాడు. బిగ్ బాస్ 3లో విన్నర్‌గా నిలిచి ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నాడు. హౌస్ లో రాహుల్ కి స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా ఉన్న శ్రీముఖి ఇతన్ని బాగా ఇబ్బంది పెట్టింది. బిగ్ బాస్ తర్వాత రాహుల్ కు వరుసగా మూవీస్ లో పాటలు పాడే అవకాశాలు వచ్చాయి. మరో పక్క ఆల్బమ్స్ కూడా చేస్తూ ఫుల్ బిజీగా వున్నాడు రాహుల్. కృష్ణవంశీ ‘రంగమార్తాండ’ మూవీలో రాహుల్ ఓ ఇంపార్టెంట్ రోల్ లో కూడా నటించాడు.
ఇక సోషల్ మీడియాలో కూడా బాగా యాక్టీవ్ గా ఉండే రాహుల్ తన పర్సనల్ లైఫ్ మూమెంట్స్ ని కూడా షేర్ చేసుకుంటూ ఉంటాడు. తాజాగా తన అభిమానులతో ఓ గుడ్ న్యూస్ పంచుకున్నాడు. బిగ్ బాస్ హౌస్ లో ఉన్నప్పుడు సొంతిల్లు అనేది తన కల అంటూ రాహుల్ చెప్పుకొచ్చిన సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు తన కొత్త ఇంటి కలను సాకారం చేసుకుని, అందులో అడుగుపెట్టినట్టు చెప్పాడు. లేటెస్ట్ గా తన గృహప్రవేశానికి సంబంధించిన వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసి.. ‘మీ అందరి ఆశీస్సుల వల్లే నా సొంతింటి కల నెరవేరింది’ అంటూ ఎమోషనల్ పోస్ట్ ఒకటి టాగ్ చేసాడు. అతని కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.