Read more!

English | Telugu

డబ్బింగ్ ఆర్టిస్ట్ ఎలా అవ్వాలో చెప్తున్న ఆర్జే కాజల్!

ఆర్జే కాజల్ .. తన వాయిస్ తో కోట్లాది మందికి పరిచయమైంది. సోషల్ మీడియాలో తనకు క్రేజ్ మాములుగా లేదనే చెప్పాలి. బిగ్ బాస్ సీజన్-5  ముందువరకు తన వాయిస్ తో బిగ్ బాస్ రివ్యూలు చెప్పిన కాజల్.. బిగ్ బాస్ సీజన్-5 లో ఎంట్రీతో లైవ్ లో తన నడవడితో తనకున్న ఫ్యాన్ బేస్ ని పెంచుకుంది. బిగ్ బాస్ హౌజ్ లో ఉన్నప్పుడు షణ్ముఖ్, సిరిలతో మొదటి నాలుగువారాలు కలిసి ఉన్న కాజల్ ఆ తర్వాత వారికి దూరమైంది. ఆ తర్వాత హౌస్ లో టాప్-6 లో ఉన్న కాజల్.. ఎలిమినేట్ అయి టాప్-5 కి దూరమైంది. బయటకొచ్చాక తనకి సినిమా అవకాశాలు పెరిగాయి.

ఆర్జే కాజల్ తన సంబంధించిన విషయాలని ఇన్ స్టాగ్రామ్ లో రెగ్యులర్ గా షేర్ చేస్తుంటుంది. అదే కాకుండా తన యూట్యూబ్ ఛానెల్ లో కూడా వ్లాగ్ లుగా అప్లోడ్ చేస్తుంటుంది. అయితే తాజాగా తను ఫ్యామిలితో కలిసి ఒక ట్రిప్ ప్లాన్ చేసి వ్లాగ్ చేయగా దానికి అత్యధిక వీక్షకాధరణ లభించగా, తాజాగా మరో కొత్త వ్లాగ్ ని తన ఛానెల్ లో అప్లోడ్ చేసింది. డబ్బింగ్ ఆర్టిస్ట్ ఎలా అవ్వాలో? ఏం చేయాలో ఈ వ్లాగ్ లో వివరించింది కాజల్.

ఆర్జే కాజల్ కి డబ్బింగ్ చెప్పే అవకాశం కల్పించిన డబ్బింగ్ ఇన్ ఛార్జ్ తో కొన్ని విషయాలను షేర్ చేసుకుంది. డబ్బింగ్ యూనియన్ ప్రెసిడెంట్ అండ్ ఇన్ ఛార్జి గోగినేని ప్రసాద్ తో కలిసి మాట్లాడించింది కాజల్. అసలు డబ్బింగ్ ఆర్టిస్ట్ అవ్వాలనుకునేవారికి మీరిచ్చే టిప్స్ ఏంటి అని గోగినేని ప్రసాద్ ని అడుగగా.. "ముందుగా మీ వాయిస్ తో మీరు సాధన చేయాలి. డబ్బుల కోసం కాకుండా డబ్బింగ్ చెప్పాలనే పాషన్ ఉండాలి. అవకాశాలు అంత ఈజీగా రావు. పనికిరాని వాయిస్ అంటూ ఉండదు. కానీ మీకిచ్చిన సన్నివేశంలోని డైలాగ్స్ ని మీరు ఏ టోన్ లో చెప్తున్నారో చూసుకోవాలి. ఏ బేస్ కావాలో కూడా పరీక్షించుకోవాలి. ఎంత ఇన్వాల్వ్ అవుతున్నాడో కూడా చూస్తుంటారు. డబ్బింగ్ స్టూడియోలో మనల్ని చూసే ఇన్ చార్జ్ , డైరెక్టర్స్ అంతా.. మనం డైలాగ్ చెప్తున్నప్పుడు ఎంత ఇన్వాల్వ్ అవుతున్నామో కూడా చూస్తారు‌" అంటూ గోగినేని ప్రసాద్ చెప్పుకొచ్చాడు.