English | Telugu
సర్ ప్రైజ్ చేద్దామనుకుంటే షాక్ ఇచ్చాడు!
Updated : Jun 17, 2023
నేహా చౌదరి.. బిగ్ బాస్ సీజన్-6 తో క్రేజ్ ని సంపాదించుకుంది. అంతకముందు ఒక యాంకర్ గాచేసి పాపులారిటీ సంపాదించుకున్న నేహా.. బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళాక తన ఫ్యాన్ బేస్ ని ఇంకా పెంచుకుంది.
మొదట ఒక ప్రముఖ ఛానల్ లో యాంకర్ గా చేసిన నేహా చౌదరి.. మల్టీ ట్యాలెంటెడ్ అనే చెప్పాలి. న్యూస్ రీడర్ గా కొన్ని రోజులు చేసి, ఆ తర్వాత ఒక సీరియల్ లో యాక్ట్ చేసింది. అంతేకాకుండా నేహా అథ్లెటిక్, యోగా ట్రైనర్ ఇలా చెప్పుకుంటూపోతే చాలానే ఉన్నాయి. ఐపీఎల్ మ్యాచ్ లకి స్టార్ స్పోర్ట్స్ తెలుగులో రెప్రెజెంటర్ గా చేసింది. విమెన్ వరల్డ్ కప్ ప్రోకబడ్డీకికూడా రెప్రెజెంటెర్ గా చేసింది. ఆ తర్వాత బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చింది. హౌస్ లోకి వచ్చేముందు తన ఇంట్లో వాళ్ళు తనకి సంబంధాలు చూస్తున్నారని చెప్పిన నేహా, బిగ్ బాస్ గ్రాంఢ్ ఫినాలే రోజు పెళ్ళి కూతురిగా రెడీ అయి వచ్చేయడంతో అందరి దృష్టి ఫినాలే రోజు తనమీదే పడింది. ఆ తర్వాత తను ఇష్టపడిన అబ్బాయినే పెళ్ళి చేసుకుంది నేహా.
నేహా తన సొంతంగా యూట్యూబ్ ఛానెల్ ని స్టార్ట్ చేసి తన ప్రతీ అప్డేట్స్ ని ఫ్యాన్స్ కి తెలియజేస్తుంది. ఇటీవల నేహా తన భర్తతో కలిసి జర్మనీకి వెళ్ళిన విషయం అందరికి తెలిసిందే. తన పేరెంట్స్ ని వదిలి వెళ్తూ ఎమోషనల్ అయిన ఒక వీడియోని పోస్ట్ చేసింది నేహా. అది అప్పట్లో వైరల్ గా మారిన సంగతి తెలిసిందే. మళ్ళీ క్రికెటర్స్ ని పెళ్ళి చేసుకోవద్దని ఒక వ్లాగ్ చేసి తన యూట్యూబ్ ఛానెల్ లో అప్లోడ్ చేయగా.. ఆ వీడియో అత్యధిక వీక్షకాధరణ పొందింది. అయితే తాజాగా నేహా తన యూట్యూబ్ ఛానెల్ లో ఒక వీడియోని అప్లోడ్ చేసింది. అందులో తన భర్తకి సర్ ప్రైజ్ ఇద్దామని అనుకుందంట కానీ తనకి షాక్ ఇచ్చాడని చెప్తుంది నేహా చౌదరి.