English | Telugu

Brahmamudi : అనామిక ప్లాన్ లో‌ కావ్య కీలుబొమ్మ కానుందా.. భర్త వర్సెస్ భార్య!


స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -524 లో.....కనకం దుగ్గిరాల ఇంటికి వస్తుంది. ఏంటి పిలవని పేరంటానికి వచ్చావ్.. ఈ సాకుతో నీ కూతురిని కాపురానికి పంపించి చేతులు దులుపుకుందామనుకుంటున్నావా? అది ఈ జన్మలో జరగదని రాజ్ ఎప్పుడో చెప్పాడు కదా అని రుద్రాణి అంటుంది. ఆ తర్వాత అపర్ణ దగ్గరికి కనకం వెళ్లి.. తన మంచి చెడులు కనుక్కుంటుంది. అబ్బో కూతురు ప్రాణం మీదకి తెచ్చింది.. తల్లి కుశలం అడుగుడానికి వచ్చిందని రుద్రాణి అంటుంది.

దాంతో రుద్రాణిపై అపర్ణ కోప్పడుతుంది. మీరు నా వాళ్ళ గొడవపడకండి అని కనకం అనగానే.. అవునులే మీ జీవితానికి సిగ్గా, శరమా అని రుద్రాణి అనగానే.. ఏదైనా జరిగితే నాకు కావ్యకి జరిగింది అంతే గాని వాళ్ళేం చేశారని రాజ్ అంటాడు. ఆ తర్వాత నా కూతురు అల్లుడు విడిపోలేదు.. అందుకు సాక్ష్యం అల్లుడు పక్కన నా కూతురు చీర ఉంది.. మరొకటి కావ్య తయారు చేసిన విగ్రహం తిరిగి ఈ ఇంటికే చేరింది. ఇది దైవ నిర్ణయమని కనకం అనగానే.. అపర్ణ హ్యాపీగా ఫీల్ అవుతుంది. రాజ్ షాక్ అవుతాడు. మరొకవైపు అనామిక సామంత్ కలిసి ఒక ప్లాన్ చేస్తారు. ఒకతనితో ఇప్పుడు కావ్య వస్తుంది. తనని డిజైన్ వెయ్యడానికి మీ కంపెనీలోకీ తీసుకొని ఆ డిజైన్స్ మాకు అమ్మాలని చెప్తుంది. దానికి అతను సరే అంటాడు. కావ్య వచ్చిందని తెలిసి ఫోన్ లైన్ పెట్టి అతని కావ్య దగ్గరికి అనామిక పంపిస్తుంది. మీకు నా కంపెనీలో జాబ్ ఇస్తున్నానని కావ్యకి అతను చెప్పగానే కావ్య హ్యాపీగా ఫీల్ అవుతుంది. వాళ్ళ మాటలన్ని అనామిక ఫోన్ లో వింటుంది. ఆ తర్వాత కావ్య హ్యాపీగా ఫీల్ అవుతూ.. ఇంటికి వచ్చి జాబ్ వచ్చిందని చెప్తుంది. కానీ కనకం చిరాకు పడుతుంది. అల్లుడు వచ్చినా నువ్వు వెళ్ళలేదని అంటుంది.

ఆ తర్వాత సీతారామయ్య ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వస్తాడు. ఇన్ని రోజులు రాలేదు. ఇప్పుడు వచ్చావంటే ఏదో పని వుండి వచ్చావని సీతారామయ్య అంటాడు. నా మనవడు శ్రీకాంత్ ఎప్పుడు మీ కంపెనీలో పెట్టుబడి పెట్టేవాడు.. ఇప్పుడు సామంత్ గ్రూప్ కంపెనీలో పెడుతున్నాడని అతను చెప్పగానే.. ఎందుకని సీతారామయ్య అడుగుతాడు. నా మనవడిని రాహుల్ అవమానించాడట అని అతను చెప్తాడు. తరువాయి భాగంలో రాజ్ ఆఫీస్ కి వెళ్తుంటే.. కంపెనీని వృద్ధి చెయ్ అని ఇందిరాదేవి చెప్తుంది. ఆ తర్వాత అనామికకి రుద్రాణి ఫోన్ చేసి.. రాజ్ ఆఫీస్ కి వెళ్తున్నాడని చెప్తుంది. నా ప్లాన్ లో నేనున్నాను.. భర్త వర్సెస్ భార్య అని అనామిక అంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Sanjana Gets Zero Points: జీరోగా సంజన.... హౌస్ మేట్స్ ఏకాభిప్రాయంతో జైల్లోకి!

బిగ్ బాస్ సీజన్-9 చివరి దశకి వచ్చింది. సోమవారం రోజు నో నామినేషన్ అని బిగ్ బాస్ చెప్పాడు. కొన్ని పాయింట్స్ గల బాక్స్ లని గార్డెన్ ఏరియాలో పెట్టాడు. అందులో జీరో నుండి రెండున్నర లక్షల వరకు నెంబర్ గల బాక్స్ లు ఉంటాయి. ఎన్ని పాయింట్స్ కి ఎవరు అర్హులో వారికి ఆ పాయింట్స్ గల బాక్స్ ఇవ్వాలి.. పై నుండి ఎవరు అయితే ముందుగా బాల్ పట్టుకుంటారో వాళ్ళకే మనీ పాయింట్స్ ఇచ్చే ఛాన్స్ ఉంటుంది. మీరు ఇచ్చే పాయింట్స్ ని హౌస్ మేట్స్ ఇద్దరు అంగీకరించాలి.. కనీసం ఇద్దరు కూడా అంగీకరించకపోతే ఆ పాయింట్స్ అతనికి రద్దు అవుతాయని బిగ్ బాస్ చెప్తాడు...