English | Telugu

డెలివరీ తర్వాత మొదటిసారి పుట్టింటికి వెళ్తున్న లాస్య

లాస్య మంజునాథ్.. ఇప్పుడు అందరికీ సుపరిచితమే. యాంకర్ గా బుల్లితెర ప్రేక్షకులను అలరించి, తనకంటూ ప్రత్యేక గుర్తింపుని తెచ్చుకున్న లాస్య ఈ మధ్యే తనకి కొడుకు పుట్టాడని చెప్పింది. ఆ తర్వాత వ్లాగ్ లు చేస్తుంది. పిల్లలు ఉన్న మదర్స్ కి టిప్స్ చెప్తూ పలు వ్లాగ్ లు చేయగా అవి యూట్యూబ్ లో వైరల్ అయ్యాయి. ఇలా తన యూట్యూబ్ ఛానెల్ లో అప్లోడ్ చేస్తూలాస్య మరింత ఫాలోయింగ్ ని సంపాదించుకుంటుంది.

పలు టీవి కార్యక్రమాలకు యాంకర్ గా చేసిన లాస్య.. చీమ, ఏనుగు జోక్స్ తో బాగా ఫేమస్ అయింది. ఇక యాంకర్ రవి, లాస్య కాంబినేషన్ షో అంటే ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వీళ్ళిద్దరి కాంబినేషన్ ఎంత హిట్ అనేది అందరికి తెలిసిందే. సంథింగ్ స్పెషల్ షోకి అప్పట్లో ఎంత క్రేజ్ ఉండేదో తెలిసిందే. కొంతకాలం పాటు బుల్లి తెరకు దూరంగా ఉన్న లాస్య.. ఆ తర్వాత బిగ్ బాస్ సీజన్-4 లో ఎంట్రీ ఇచ్చి విశేషంగా ఆకట్టుకుంది. పోస్డ్ డెలివరీ అంటూ తనకి బాబు పుట్టాక, తను ఎలా ఉంటుందో, పేరు పెట్టేప్పుడు ఒక వ్లాగ్, మదర్స్ డే వ్లాగ్, తనకి బాబు పుట్టాక తన దినచర్య ఏంటో ఒక వ్లాగ్ గా అప్లోడ్ చేస్తూ ట్రెండింగ్ లో ఉంటూ వస్తోంది లాస్య.

డెలివరీ తర్వాత మొదటిసారి తన పుట్టింటికి వెళ్తుందంట లాస్య. దాంతో వాళ్ళ లగేజ్ ప్యాకింగ్ ఎలా ఉంటుందని వివరించింది లాస్య. వాళ్ళ కొడుకులు జున్ను, మున్నుల కోసం తను తీసుకునే జాగ్రత్తలని చెప్పడమే కాకుండా, ఇంకా ఆడుకునే వస్తువులను టాయ్స్ ని అన్నింటిని ప్యాక్ చేసుకొని తీసుకెళ్తుంది లాస్య. అయితే ఇద్దరు బయటకెళ్ళడం ఒకటైతే ఇద్దరు పిల్లలతో బయటకెళ్ళడం మరింత కష్టమని వాటికి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఈ వ్లాగ్ లో చెప్పుకొచ్చింది లాస్య. పిల్లలు ఉన్న ప్రతీ ఒక్కరు వారి సంరక్షణ కోసం కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలంటూ ఈ వీడియోలో చెప్పింది. కాగా ఇప్పుడు ఈ వ్లాగ్ కి విశేష స్పందన లభిస్తోంది.