English | Telugu
మా లవ్ స్టోరీ మొదటి పార్ట్!
Updated : Nov 18, 2023
నేహా చౌదరి.. బిగ్ బాస్ ప్రేక్షకులకు సుపరిచితే. స్పోర్ట్స్ రిప్సెంటర్ గా కొంతమందికి తెలిసింది. ఆ తర్వాత బిగ్ బాస్ ఎంట్రీతో ఒక్కసారిగా అందరికి తెలిసిపోయింది. బిగ్ బాస్ లో నేహా ఉంది కొన్ని రోజులే అయిన మంచి ఎంటర్టైన్మెంట్ చేసింది. దాంతో అభిమానులు తనకి సపోర్ట్ చేసారు.
నేహా తన కెరీర్ ని యాంకరింగ్ తో మొదలుపెట్టింది. చిన్నప్పటి నుండి తనకి యాంకరింగ్, యాక్టింగ్ మీద ఆసక్తి ఉండేదంట. విమెన్ వరల్డ్ కప్ ప్రోకబడ్డికి కూడా రెప్రెజెంటెర్ గా చేసింది నేహా. ఆ తర్వాత బిగ్ బాస్ ఎంట్రీతో ఒక్కసారిగా సెలెబ్రిటీ జాబితాలోకి చేరింది నేహా. బిగ్ బాస్ నుండి బయటకు వచ్చాకే నేహాకి పెళ్లి జరిగింది అది కూడా బిగ్ బాస్ 6 గ్రాండ్ ఫినాలే రోజే నేహా పెళ్లి జరిగింది.. నేహా పెళ్లి కూతురు గెటప్ లోనే గ్రాండ్ ఫైనల్ కి అటెండ్ అయిన విషయం అందరికి తెలిసిందే.
నేహా తన సొంతంగా యూట్యూబ్ ఛానెల్ ని స్టార్ట్ చేసి తన ప్రతీ అప్డేట్స్ ని ఫ్యాన్స్ కి తెలియజేస్తుంది. పెళ్ళి తర్వాత జర్మనీకి వెళ్ళిన నేహా చౌదరి.. అక్కడ సర్ ప్రైజ్ అంటూ తన భర్తని కలవడానికి వెళ్ళింది. అదంతా కలిపి ఒక వ్లాగ్ అప్లోడ్ చేయగా వైరల్ అయ్యింది. బర్త్ డే సర్ ప్రైజ్ వ్లాగ్, అవుటింగ్ అంటు ట్రావెలింగ్ వ్లాగ్స్ చేస్తూ ఎప్పటికప్పుడు ఫుల్ ట్రెండింగ్ లో ఉంటుంది నేహా చౌదరి. అయితే ఈ వ్లాగ్స్ ని తన పర్సనల్ యూట్యూబ్ ఛానెల్ లో పోస్ట్ చేస్తుంది నేహా చౌదరి.
తాజాగా తన యూట్యూబ్ ఛానెల్ లో మా లవ్ స్టోరీ పార్ట్ -1 అనే వ్లాగ్ ని పోస్ట్ చేసింది నేహా. అందులో తన భర్త అనిల్ తో కలిసి వారిద్దరి జర్నీ ఎలా సాగిందో వివరించింది. సినిమాటిక్ రేంజ్ లో, భారీ ట్విస్ట్ లు ఉన్నాయని నేహా చెప్పగా.. అవేమీ లేవని బిటెక్ లో కాలేజ్ స్టార్ట్ అయినప్పుడు మొదటి సారి చూసి.. హే ఈ అమ్మాయేదో బాగుందే అని అనిల్ అనుకున్నాడంట. ఇక కొన్ని రోజులకి అనిల్ ముందు ప్రపోజ్ చేసాడంట. ప్రపోజ్ చేసాక ఒక అయిదు ఆరు నెలలు టైమ్ తీసుకుందంట నేహా. ఆ తర్వాత ఒక మంచి రోజు చూసుకొని అనిల్ ప్రపోజ్ ని యాక్సెప్ట్ చేసిందంట. వారిద్దరి పరిచయం నుండి ఇప్పటివరకు ఎలా జరిగిందో? ఏం జరిగిందో చెప్తూ చేసిన ఈ వ్లాగ్ ఇప్పుడు యూట్యూబ్ లో ట్రెండింగ్ లో ఉంది.