English | Telugu

నాగార్జునకి అడ్డంగా దొరికిన శివాజీ, ప్రశాంత్.. డబుల్ ఎలిమినేషన్!



బిగ్ బాస్ సీజన్-7 ఇప్పటికే పది వారాలు పూర్తి చేసుకుంది. ఇక పదకొండవ వారం హౌస్ లో ఎవరు ఎలిమినేషన్ అవుతారనే క్యూరియాసిటి అందరిలో మొదలైంది. అయితే శనివారం నాటి ప్రోమో కోసం బిగ్ బాస్ అభిమానులు ఎంతగా ఎదురు చూస్తారో తెలిసిందే.

ఎప్పుడెప్పుడ అని ఎదురుచూస్తున్న శనివారం నాటి ప్రోమో రానే వచ్చింది. ఇందులో నాగార్జున ఫుల్ ఫైర్ మీద ఉన్నట్టు రావడం రావడమే షుగర్ తో చేసిన బాటిల్స్ తీసుకొని వచ్చాడు. ఒక్కో కంటెస్టెంట్ తల మీద ఆ బాటిల్ పగులగొట్టి వార్నింగ్ ఇచ్చాడు నాగార్జున. శివాజీని లేపి.. నాకు కొన్ని డౌట్స్ ఉన్నాయి? కొన్ని సమస్యలున్నాయని నాగార్జున అన్నాడు. అప్పుడప్పుడు వచ్చే బూతులే కదా సర్ అని శివాజీ అన్నాడు. " ఈ విషయంలో నీ సమర్థత ఏం అయింది. ఈ విషయంలో నీ సహనం ఏమైంది. పిచ్చి పోహా, ఎర్రి పోహా ఇవన్నీ హౌస్ లో వాడే పదాలా శివాజీ" అని నాగార్జున అన్నాడు.

ఆ తర్వాత రతిక ఫోటో మీద బాటిల్ పగులకొట్టి.... ఇకనుండి కొన్ని పదాలను బ్యాన్ చేస్తున్నాను. " వచ్చేవారం నుండి నేనేంటో చూపిస్తాను. నేను ఆడతాను. ఇలాంటి పదాలన్నీ బ్యాన్ చేస్తున్నాను" అని రతికతో అన్నాడు. అమర్.. నేను విన్నర్ అని అనుకోకపోతే ఎలా గెలుస్తావని అమర్ దీప్ తో నాగార్జున అన్నాడు. చెల్లెలిని గెలిపించడం తప్ప హౌస్ లో నువ్వేమైనా చేశావా గౌతమ్ అని అన్నాడు. అసలు ఈ వారం ఏం అయినా ఆడావా ప్రశాంత్.. ఫ్యామిలీ వీక్ లో వచ్చినవాళ్ళంతా టాప్-5 లో నీ పేరు పెట్టారని, హమ్మయ్య ఇంకా నేను ప్రూవ్ అని అనుకున్నావా లేక ఇంకెవరికైనా అవకాశం ఇద్దామని అనుకున్నావా ప్రశాంత్ అని నాగార్జున అన్నాడు. ఇలా ఈ వారం కంటెస్టెంట్స్ ఆడిన ఆటతీరుని ప్రశ్నిస్తూ గట్టి వార్నింగ్ ఇచ్చినట్టు తెలుస్తోంది. మరి ఎవరెవరికి వార్నింగ్ ఇచ్చాడో తెలియాలంటే పూర్తి ఎపిసోడ్ వచ్చేవరకు ఆగాల్సిందే. కాగా మరోక విషయం ఏమిటంటే.. ఈ వారం డబుల్ ఎలిమినేషన్ ఉంటుందనే వార్తలు వస్తున్నాయి... ఏది ఎమైనా.. రేపటి ఎలిమినేషన్ రౌండ్ వచ్చేంతవరకు ఆగాల్సిందే!

Karthika Deepam2 : కాశీ అకౌంట్ లో అయిదు లక్షలు.. స్వప్న చూసి షాక్!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -551 లో..... కాంచన అన్న మాటలకి శ్రీధర్ బాధపడుతాడు. తినడం మానేస్తాడు. కార్తీక్ వచ్చి నాన్న భోజనం చెయ్యమని తినిపిస్తుంటే ముద్ద దిగడం లేదురా అని ఏడుస్తాడు. ఎందుకు అమ్మ ఇవన్నీ ఇప్పుడు.. ఎప్పటిలాగే మాట్లాడుకోవచ్చు కదా అని కార్తీక్ అంటాడు. నేను కావేరి తరుపున వచ్చాను.. తను ఫోన్ చేసి భయపడుతుంటే చూడలేక వచ్చానని చెప్తుంది. దాంతో శ్రీధర్ బాధపడుతూ అక్కడ నుండి వెళ్ళిపోతాడు. ఇక కాంచనని కార్తీక్ తీసుకొని అక్కడ నుండి వెళ్ళిపోతాడు.