English | Telugu

అమర్‌ దీప్ కోసం వెక్కివెక్కి ఏడుస్తున్న అరియాన!

బిగ్ బాస్ నిన్నటి ఎపిసోడ్ లో అమర్ ని చూసిన ప్రతి ఒక్కరు ఎమోషనల్ అయ్యారని అనడంలో ఆశ్చర్యం లేదు. హౌస్ లోకి అమర్ ఎంట్రీతో స్ట్రాంగ్ కంటెస్టెంట్ టాప్ 5 పక్కా అని బిగ్ బాస్ అభిమానులు అనుకున్నారు. కానీ మొదట తన అయిదు వారాలు తన గేమ్ ని చూసిన ప్రేక్షకులు.. అసలు ఈ హౌస్ లో ఉంటాడా అని అనుమానం వ్యక్తం చేశారు.

అయితే అమర్ దీప్.. ప్రతి టాస్క్ లో ఏకాగ్రతతో ఆడకుండా, ఫౌల్స్ ఆడుతు ఓడిపోతూ వస్తున్నాడు. ప్రతి వీక్ నాగార్జున తో చీవాట్లు పడుతున్నాడు కానీ ఫ్యామిలీ వీక్ తరువాత అమర్ లో చాలా మార్పు కన్పించింది. హౌస్ లో పాజిటివ్ గా ఉండడం.. గేమ్ పైన ఫోకస్ పెట్టడంతో టాప్ 5 గ్యారంటి అని అనుకుంటున్నారు. నిన్న జరిగిన ఎపిసోడ్ లో కెప్టెన్సీ కోసం హౌస్ మేట్స్ అంత పోటీపడగ అందులో నెక్స్ లెవెల్ కీ ప్రశాంత్, అమర్, ప్రియాంక, అర్జున్ వెళ్ళారు. చివరగా అమర్, ప్రియాంక ఉన్నారు. అయితే ఇద్దరు కూడా ఇది వరకూ కెప్టెన్ కానివారే.. కానీ హౌస్ లో అమర్ ని టార్గెట్ చేసి రతిక, గౌతమ్ లు ప్రియాంకకి సపోర్ట్ ఇస్తూ అమర్ బ్రిక్స్ ని పడిపోయేలా బాల్స్ విసిరారు. ఇన్ని రోజులు గేమ్ ని ప్రూ చేసుకునే అవకాశం రాలేదు. ఇప్పుడు టార్గెట్ చెయ్యకండి అంటూ అమర్ గట్టిగా అరుస్తూ ఏడ్చేశాడు.

అమర్ దీప్ ని ఆ మూమెంట్ చూసిన అందరు ఎమోషనల్ అయ్యారు. ఇలా ఒక కంటెస్టెంట్ ఏడ్వడమనేది ఈ సీజన్ లో ఎమోషనల్ ఎపిసోడ్ అనే చెప్పాలి. అమర్, అరియాన క్లోజ్ ఫ్రెండ్స్ అన్న విషయం అందరికి తెలిసిందే. ఈ సీజన్ మొదలైన నుండి అమర్ కీ సపోర్ట్ ఇస్తూ వస్తుంది అరియాన. అయితే నిన్న జరిగిన ఎపిసోడ్ లో అమర్ ఏడవడం చూసి అరియాన ఏడుస్తూ తన ఇన్ స్టాగ్రామ్ లో ఓక వీడియోని పోస్ట్ చేసింది. అందులో అలా అమర్ ని టార్గెట్ చేయడం కరెక్ట్ కాదు అంటు అరియాన చెప్పుకుంటు ఎమోషనల్ అయింది. కాగా ఇప్పుడు ఆ వీడియో వైరల్ గా మారింది.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.