English | Telugu

ఇండియన్ ఐడల్ సీజన్ 3 నుంచి కేశవ్ రామ్ ఎలిమినేట్..

ఇండియన్ ఐడల్ సీజన్ 3 ఆహా ఓటిటి ప్లాటుఫారం మీద సక్సెస్ ఫుల్‌గా రన్ అవుతోంది. ఐతే ఇప్పుడు ఈ సీజన్ లో ఒక్కొక్కరిగా ఎలిమినేట్ ఐపోతున్నారు. ఐతే ఇంతవరకు తన పాటలతో ఆకట్టుకున్న కేశవ్ రామ్ రీసెంట్ ఎపిసోడ్ లో ఎలిమినేట్ అయ్యాడు. దాంతో కేశవ్ కి ఉన్న ఫాన్స్, ఆడియన్స్ షాక్ అయ్యారు. కేశవ్ సాంగ్స్ అంటే పడిచచ్చిపోయే ఫాన్స్ చాలామంది ఉన్నారు. ఆయన గాత్రం మృదుమధురంగా ఉంటుంది. కేశవ్‌కి ముందు, కుశాల్ శర్మ, హరి ప్రియ, రాంజీ శ్రీపూర్ణిమ, శ్రీధృతి, అభిగ్న, సాయి వల్లభ ఎలిమినేట్ అయ్యారు. ప్రేక్షకుల నుంచి వస్తున్నా ఓట్లు జడ్జ్ ల స్కోర్‌ ఆధారంగా ఈ ఎలిమినేషన్స్ జరుగుతున్నాయి.

రీసెంట్ గా జరిగిన ఎపిసోడ్స్ లో కేశవ్ రామ్, శ్రీకీర్తి, స్కంద డేంజర్ జోన్‌లో ఉన్నారు. ఐతే ఇందులో ఆడియన్స్ నుంచి ఎక్కువ ఓట్లు రావడంతో స్కంద సేఫ్ జోన్ లోకి వెళ్ళాడు. అతి తక్కువ ఓట్లతో కేశవ్ ఎలిమినేట్ అయ్యాడు. దాంతో అక్కడ ఉన్నవారందరూ షాక్ అయ్యారు. ఐతే సింగర్ కార్తీక్ సెప్టెంబర్ 28న తిరుపతిలో, నవంబర్ 9న హైదరాబాద్‌లో జరగబోయే తన కాన్సర్ట్ లో పార్టిసిపేట్ చేయాలంటూ ఇన్వైట్ చేసాడు. ఇక ఈ షోకి గెస్ట్ గా వచ్చి అల్లరి చేసిన హీరో నవీన్ పోలిశెట్టి కూడా కొన్ని ఇన్స్పైరింగ్ వర్డ్స్ చెప్పాడు “నా ఫైటింగ్ డేస్ లో, సక్సెస్ కోసం చాలా రోజులు వెయిట్ చేశాను. యాక్టింగ్ రియాలిటీ షోలో పాల్గొనే అవకాశం వచ్చింది. ఆ షోలో విజేతకు బాలీవుడ్ లో ఓ పెద్ద బ్యానర్ లో నటించే ఛాన్స్ వస్తుంది ..నా పర్ఫామెన్స్ బాగున్నప్పటికీ నాలుగో రౌండ్‌లో ఎలిమినేట్ అయ్యాను. కేశవ్ ఎలిమినేషన్ చూడగానే నాకు ఆ రోజు గుర్తొచ్చింది. నా ఎలిమినేషన్ తర్వాత నేను చాలా నిరాశపడ్డాను. ఐతే ఆ షోలో విన్నర్ ఐన వ్యక్తి ఇంతవరకు సినిమా చేయలేదు. కానీ నేను హీరోని అయ్యా.. ప్రేక్షకుల నుంచి నాకు లభించిన ప్రేమ ఎంతో గొప్పది. కేశవ్ ని ఇన్స్పైర్ చేయడానికి ఈ విషయాలను చెప్పా" అన్నాడు నవీన్ పోలిశెట్టి.

Podharillu:పొదరిల్లు సీరియల్ లో సూపర్ ట్విస్ట్.. మహాలక్ష్మికి పెళ్ళి ఫిక్స్!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -02 లో.....మహాలక్ష్మి ప్రాజెక్ట్ డిజైన్ రెడీ చేసి హాల్లోకి వస్తుంది. వాళ్ళ నాన్న ప్రతాప్ ఇంకా అన్నయ్య మహాలక్ష్మికి డెస్టినేషన్ వెడ్డింగ్ ప్లాన్ చేస్తారు. ఒకసారి చూడు మహా అని వాళ్ళ అన్నయ్య అంటాడు. నాకేం ఇప్పుడు పెళ్లి వద్దు అవసరం అయితే వదిన నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకోండి అని మహా అంటుంది. ఇప్పుడు డిజైన్స్ చూపించడానికి వెళ్తున్నానని తెలిస్తే డాడీ వద్దని అంటాడనుకొని డాడీ కాలేజీలో సర్టిఫికెట్ ఉన్నాయి తెచ్చుకుంటానని చెప్తుంది.