English | Telugu

కృష్ణ ముకుందల మధ్య ఛాలెంజ్ లో గెలుపెవరిది!


స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కృష్ణ ముకుంద మురారి'. ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -274 లో.. భవానికి తన ప్రేమ విషయం చెప్పాలని అనుకుంటుంది ముకుంద. ఆదర్శ్ గురించి ఏదో చెప్పబోతుండగా, ఎక్కడ భవానికి ముకుంద తన ప్రేమ విషయం చెప్పేస్తుందోనని కృష్ణ భవాని గదిలోకి వస్తుంది. ముకుందని చెప్పనీయకుండా డైవర్ట్ చేస్తుంది. పెద్ద అత్తయ్యను డిస్టబ్ చేస్తున్నావ్ పడుకోనివ్వంటు కృష్ణ అంటుంది. పదా మనం కబుర్లు చెప్పుకుందామంటూ ముకుందని కృష్ణ బయటకి తీసుకొని వస్తుంది.

ఆ తర్వాత కృష్ణ, ముకుంద ఇద్దరు మాట్లాడుకుంటారు. నేను ఆదర్శ్ ని తేవాలని అనుకుంటున్నాను, తెస్తాను. నేను అనుకున్నది సాధిస్తాను. నువ్వు అనవసరమైన దాని గురించి టెన్షన్ పడకంటు ముకుందకి కృష్ణ చెప్తుంది. ఆ తర్వాత కృష్ణ మాటల్లో ముకుంద తన ప్రేమ విషయం తెలిసిందిమని అర్థం అవుతుంది. ఇక డైరక్ట్ మ్యాటర్ లోకి వచ్చేస్తుంది ముకుంద‌. నేను మురారిని ప్రేమించాను తప్పనిసరి పరిస్థితులలో ఇద్దరం వేరు వేరు పెళ్లిళ్లు చేసుకున్నామని కృష్ణతో ముకుంద అంటుంది. పరాయి మగాడి మీద ఇష్టాన్ని పెంచుకోనే ఆడదాన్ని ఏం అంటారో నాకు తెలియదని కృష్ణ అంటుంది. మురారి మనసులో నాకు స్థానం ఉంది. అది ఒక్కప్పుడా, ఇప్పుడా అనేది ముఖ్యం కాదు. మరి మురారి మనసులో నీకు స్థానం ఉందా అని ముకుంద అడుగుతుంది. అప్పుడు కృష్ణ తన మెడలో మురారి కట్టిన తాళిని చూపిస్తూ ఇది ఉందని అంటుంది. మాది భార్యభర్తల బంధమని కృష్ణ అంటుంది.

ఆ తర్వాత కృష్ణ ముకుంద ఇద్దరు అనుకున్నది నెరవేర్చుకుంటానంటు ఇద్దరు ఛాలెంజ్ విసురుకుంటారు. ఆ తర్వాత కృష్ణ పడుకున్న మురారిని చూస్తుంటుంది. మురారి మనసులో ముకుంద లేదు. నాకు సంతోషం కానీ ఏసీపీ సర్ మనసులో నా మీద ప్రేమని చెప్పేలా చేసుకోవాలని కృష్ణ అనుకుంటుంది. కృష్ణ తల తుడ్చుకుంటుంటే మురారి చూసి.. అలా కాదంటు కృష్ణ తల తుడుస్తాడు మురారి. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.