English | Telugu
ముంబై హోటల్‌లో బిగ్ బాస్ ప్రియాంక బోల్డ్ లుక్!
Updated : Sep 28, 2023
జబర్దస్త్ ద్వారా ఫేమ్ సంపాదించిన ప్రియాంక సింగ్ అలియాస్ సాయితేజ.. బిగ్ బాస్ -5 లో ఛాన్స్ కొట్టేసింది. జబర్దస్త్ కి ముందు నుంచే ఆమె ట్రాన్స్ జెండర్.. కాగా సొసైటీలో ట్రాన్స్ జెండర్ పై చిన్న చూపు అంటూ ఆమె చాలా సందర్భాలలో చెప్పుకొచ్చింది. అయితే తన ఇంట్లో వాళ్ళకి ఇష్టం లేకుండా ప్రియాంక సింగ్ ఇండస్ట్రీకి వచ్చింది.
బిగ్ బాస్- 5 లో అవకాశం రావడంతో ఒక్కసారిగా సెలబ్రిటీ అయిపోయింది. అయితే తన బాడీని ఒక అమ్మాయిలాగా మేకోవర్ చేపించుకొని, హీరోయిన్ కి ఏమాత్రం తీసిపోని అందం, అభినయంతో ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది ప్రియాంక సింగ్. మంచి ఫ్యామిలీ ఎమోషన్స్ తో బిగ్ బాస్ ప్రేక్షకులకు మరింత చేరువైన తను.. బిగ్ బాస్ లో తన హౌస్ మేట్ అయిన మానస్ తో సన్నిహితంగా ఉండేది. బిగ్ బాస్ నుండి బయటికొచ్చాక పలు టీవీ షోస్ లో మెరిసిన ప్రియాంక సింగ్.. చేసే ప్రతి పనిని వ్లాగ్ చేస్తూ తన ఇన్ స్టాగ్రామ్ లో, యూట్యూబ్ ఛానల్ లో పోస్ట్ చేస్తుంటుంది. అలా తను సమాజంలో ట్రాన్స్ జెండర్స్ మీద ఉన్న చులకన భావాన్ని కాదని.. ఒక్కతే బ్రతికి చూపిస్తూ ఎంతోమందికి ఆదర్శంగా నిలుస్తోంది. చాలా మంది ఆమెని ఇన్స్పిరేషన్ గా తీసుకుంటున్నారు.
ప్రియాంక సింగ్ మొదట్లో సింప్లిసిటీకి కేరాఫ్ గా ఉండేది. ఆమధ్య బోల్డ్ ఫొటోస్ పెట్టి నెగెటివ్ కామెంట్స్ ని తెచ్చిపెట్టుకుంది. ప్రియాంక ఈ మధ్యే "సమ్మోహనుడా" పాటకి హాట్ డాన్స్ చేసింది. ప్రియాంక పక్కన ఒక అతను డాన్స్ చేశాడు. అతని మొహం మాత్రం కనిపించకుండా చూసేవాళ్ళకి ఎవరతను అనే క్యూరియసిటి పెంచింది. బిగ్ బాస్ లో ఉన్నప్పుడు మానస్ ని తన క్రష్ గా చెప్పిన ప్రియాంక.. హౌస్ లో ఉన్నన్ని రోజులు తన వెంటే తిరిగేది. అయితే ఈ సమ్మోహనుడా పాటలో ప్రియాంకతో కలిసి డాన్స్ చేసింది మానస్ అని కొందరు నెటిజన్లు అన్నారు. అయితే మానస్ కి రీసెంట్ గా ఎంగేజ్ మెంట్ అయిన విషయం తెలిసిందే. అయితే ప్రియాంక ఇప్పుడు ఒక షూట్ కోసం ముంబై వెళ్ళింది. అక్కడ తను బోల్డ్ లుక్ లో కన్పించింది. థైస్ చూపిస్తూ తన ఇన్ స్టాగ్రామ్ లో అప్లోడ్ చేసిన ఈ ఫోటోలు ఇప్పుడు వైరల్ గా మారాయి.