English | Telugu
స్వప్నని కాపాడటానికి కనకం ఏం చేయనుంది?
Updated : Sep 28, 2023
స్టార్ మా టీవిలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'. ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -213 లో.. కావ్య వేసే ప్రశ్నలకు రాహుల్ కన్ఫ్యూస్ అవుతుంటే.. ఎక్కడ నిజం తెలిసిపోతుందోనని రుద్రాణి కావ్యని డైవర్ట్ చెయ్యడానికి ప్రయత్నిస్తుంది. కానీ కావ్య మాత్రం మా అక్క ఎక్కడ అంటూ ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తునే ఉంటుంది.
మరొక వైపు మైఖేల్ మార్కెట్ కి వస్తాడు. అప్పుడే రాహుల్ ఫోన్ చేసి స్వప్న గురించి అడుగుతాడు. స్వప్నని చంపేసేమని మైఖేల్ చెప్పగానే రాహుల్ సంతోషపడతాడు. కానీ మైఖేల్ స్వప్నని చంపాలని అనుకోడు. పెళ్లి చేసుకోవాలని అనుకుంటాడు. మరొకవైపు కనకం కూరగాయలు కొంటు ఉంటుంది. అప్పుడే మైఖేల్ వచ్చి పెళ్లికి దండలు కొనడానికి కనకం హెల్ప్ తీసుకుంటాడు. ఆ తర్వాత నాకు పెళ్లి. నా కాబోయే భార్యని చూడండంటూ కనకంని మైఖేల్ ఇబ్బంది పెడతాడు. కాసేపటికి స్వప్న ఫోటోని మైఖేల్ చూపించగానే.. కనకం చూసి షాక్ అవుతుంది. అక్కడ నుండి మైఖేల్ వాళ్ళు వెళ్ళిపోతారు. మరొక వైపు రాహుల్ ని కొట్టి స్వప్నని తీసుకొని వెళ్లిన వారి గురించి కనుక్కోవడానికి పోలీసులు వస్తారు. ఆ తర్వాత స్వప్న కనిపించడం లేదని కావ్య బాధపడుతుంటే రాజ్ ఓదారుస్తాడు. అప్పుడే కావ్యకి కనకం ఫోన్ చేసి.. స్వప్న ఎక్కడ ఉందని అడిగేసరికి.. కావ్య చెప్పలేకపోతుంది. దాంతో కనకంతో స్వప్నని ఎవరో కిడ్నాప్ చేశారని రాజ్ చెప్పగానే.. కనకం షాక్ అవుతుంది. వెంటనే ఫోన్ కట్ చేస్తుంది కనకం.
ఆ తర్వాత కనకం ఆలోచిస్తుంటుంది. అంటే ఇందాక వచ్చిన వాళ్ళు నిజంగానే స్వప్నని కిడ్నాప్ చేశారా? నా కూతురిని ఎలా కాపాడుకోవాలని అనుకొని వాళ్ళు తన దగ్గర ఉన్నప్పుడు ఎవరితనో ఫోన్ మాట్లాడుతు అడ్రస్ గురించి మాట్లాడడం గుర్తుచేసుకుంటుంది. మరొక వైపు మైఖేల్ వాళ్ళు పూజారి దగ్గరికి వస్తారు. ఎందుకు అన్న పూజారి.. పోయినసారి కూడా పూజారి వల్లే స్వప్నతో పెళ్లి ఆగిపోయిందని మైఖేల్ దగ్గరున్న అసిస్టెంట్ అంటాడు. నేను సెంటిమెంట్ బాగా ఫాలో అవుతానని తెలుసుకదా అని మైఖేల్ అంటాడు. మరొకవైపు అక్కడ పూజారిలా రెడీ అయి కనకం ఉంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.