English | Telugu

బిగ్‌బాస్‌: ష‌న్నుకు కింగ్ నాగ్ స్ట్రాంగ్ వార్నింగ్‌

బుల్లితెర రియాలిటీ షో బిగ్‌బాస్ సీజ‌న్ 5 ఎండింగ్‌కి రోజులు ద‌గ్గ‌ర‌ప‌డుతున్నా కొద్దీ వివాదాలు మ‌రీ ఎక్కువ‌వుతున్నాయి. ఈ షోపై గ‌త షోల‌కు మించి విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్న విష‌యం తెలిసిందే. కంటెస్టెంట్‌ల ప‌రంగానూ, కింగ్ నాగ్ విష‌యంలోనూ దారుణంగా విమ‌ర్శ‌లు వినిపిస్తున్నాయి. తాజాగా అవి ప‌తాక స్థాయికి చేరిన‌ట్టుగా తెలుస్తోంది. ఇందుకు ప్ర‌ధాన కార‌ణం ష‌న్ను, సిరి జంట చేసే ప‌నులే అని తెలుస్తోంది. 12వ వారంలోకి ఎంట‌రైన బిగ్‌బాస్ సీజ‌న్ 5 ఆస‌క్తిక‌ర మ‌లుపుల‌తో విమ‌ర్శ‌ల పాల‌వుతోంది.

ఇప్ప‌టి వ‌ర‌కు ఈ షోకి వ‌చ్చిన 19 మందిలో 11 మంది ఎలిమినేట్ అయి ఇంటిదారి ప‌ట్టారు. జెస్సీ అనారోగ్య కార‌ణాల వ‌ల్ల ఇంటి నుంచి బ‌య‌టికి వెళ్లిపోయిన విష‌యం తెలిసిందే. ప్ర‌స్తుతం ఇంటిలో యాంక‌ర్ ర‌వి, స‌న్నీ, ష‌న్ను, సిరి, కాజ‌ల్‌, మాన‌స్‌, ప్రియాంక‌, శ్రీ‌రామ‌చంద్ర‌తో క‌లిపి 8 మంది స‌భ్యులున్నారు. ఈ ఎనిమ‌బిది మంది ఇంటి స‌భ్యుల్లో ఈ వారం ఎవ‌రు ఎలిమినేట్ అవుతార‌న్న‌ది ఆస‌క్తిని రేకెత్తిస్తోంది. ఇదిలా వుంటే శ‌నివారం కింగ్ నాగార్జున .. కంటెస్టెంట్ ష‌న్నుకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన‌ట్టుగా తెలుస్తోంది.

కెప్టెన్సీ టాస్క్‌లో బాగా ఆడావ‌ని అభినందిస్తూనే ఇంటి స‌భ్యుల స‌హ‌కారం వ‌ల్లే నువ్వు కెప్టెన్ కాగ‌లిగావ‌ని నాగ్ .. ష‌న్నుకు చుర‌క‌లంటించార‌ట‌. అంతే కాకుండా కెప్టెన్సీ టాస్క్ లో భాగంగా జ‌రిగిన వాద‌నలో కాజ‌ల్ జెండ‌ర్ గురించి ప్ర‌స్తావించిన‌ప్పుడు ఎందుకు అలా రియాక్ట్ అయ్యావ‌ని, త‌ను ఒక‌సారి అంటే అదే ప‌దాన్ని ప‌దే ప‌దే ఎందుకు అనాల్సి వ‌చ్చింద‌ని నాగ్ మండిప‌డ్డార‌ట‌. ఇక సిరి మ‌ద‌ర్ హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చి అంతా బాగానే వుంది కానీ హ‌గ్గులు మాత్రం త‌న‌కు న‌చ్చ‌లేద‌న్న‌ప్పుడు నువ్వెందుకు ఫీల‌య్యావ్‌.. అలా ఎందుకు రియాక్ట్ కావాల్సి వ‌చ్చింద‌ని పాగ్ ఓరేంజ్‌లో ష‌న్నుకీ క్లాస్ పీకార‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి. అస‌లు శ‌నివారం ఎపిసోడ్‌లో నాగ్ ఎవ‌రికి షాక్ ఇవ్వ‌బోతున్నాడు? .. ష‌న్నుని ఏరేంజ్‌లో ఆడుకున్నాడు? అన్న‌ది తెలియాటంటే టుడే ఎపిసోడ్ ని మిస్ అవ్వ‌కూడ‌దంతే..

Karthika Deepam2 : దీప అమ్మానాన్నలు గొప్పొళ్ళు.. నోరు జారిన జ్యోత్స్న!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -537లో.. శివన్నారాయణ ఇంటికి శ్రీధర్ వస్తాడు. పారిజాతం కాఫీ తీసుకొని వస్తుంది. తనని చూసి మీరేంటి అత్తయ్య కాఫీ తీసుకొని వచ్చారని శ్రీధర్ అడుగుతాడు. ఈ ఒక్క రోజు దీప డ్యూటీ తనకి వచ్చిందని కార్తీక్ అంటాడు. అది తర్వాత గానీ ముందు ప్రెజెంటేషన్ ఇవ్వమని శివన్నారాయణ అనగానే శ్రీధర్, కాశీకీ ఫోన్, లాప్ టాప్ తీసుకొని రమ్మని చెప్తాడు. కాశీ వచ్చి సర్ అని శ్రీధర్ ని పిలుస్తుంటే.. ఏంటి వాడిని నీ చుట్టూ తిప్పుకుంటున్నావని పారిజాతం అంటుంది.

Illu illalu pillalu : పార్క్ కి రమ్మని అమూల్యకి లెటర్ రాసిన విశ్వ.. అందరూ చూసేసారుగా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -338 లో. అమూల్యని ఎలాగైనా ఒప్పించి పెళ్లి చేసుకోవాలని విశ్వ అనుకుంటాడు. అమూల్యని పిలుస్తాడు. తనకి విశ్వ ఏం చెప్తున్నాడో ఏం అర్థం కాదు.. దాంతో విశ్వ ఒక పేపర్ పై ఈ రోజు సాయంత్రం పార్క్ లో కలుద్దామని రాసి అమూల్యకి విసిరేస్తాడు. అది అమూల్య చూసి ఒకే అంటుంది. ఆ పేపర్ ని పక్కన విసిరేస్తుంది. అది చందు చూసి చుట్టూ పక్కన ఎవరు ఉన్నారని చూడగా.. బట్టలు ఆరెస్తూ శ్రీవల్లి కనిపిస్తుంది. శ్రీవల్లి రాసిందనుకొని తన వైపుకి మళ్ళీ విసురుతాడు.