English | Telugu
Karthika Deepam2 : దీపకి నిజం చెప్పేసిన కార్తీక్.. మరి దాస్ ఎక్కడ?
Updated : Jul 10, 2025
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -405 లో......అసలు జ్యోత్స్న ఎందుకు అలా ఉంది బావ అని కార్తీక్ ని అడుగుతుంది దీప. గౌతమ్ దగ్గరికి వెళ్ళినప్పుడు జ్యోత్స్న ఒంటరిగా ఉందని చెయ్యి పట్టుకున్నాడని కార్తీక్ చెప్తాడు. మరి నువ్వు లోపలకి వెళ్లలేదా అని దీప అనగానే లేదు తర్వాత వెళ్ళానని కార్తీక్ అంటాడు. థాంక్స్ దీప.. జ్యోత్స్న గురించి అలోచించి నన్ను వెళ్ళమన్నావని కార్తీక్ అనగానే.. నేను ఒక తల్లి కూతురిని.. ఒక కూతురుకి తల్లిని కదా ఆలోచించకుండా ఎలా ఉంటానని దీప అంటుంది.
మనం కొద్ది కొద్దీగా జ్యోత్స్న గురించి నాన్నకి తెలిసేలా చెయ్యాలని దీప అనగానే.. మావయ్యకి జ్యోత్స్న గురించి తెలుసు.. దాస్ మావయ్యని కొట్టింది తనే అని మావయ్యకి తెలుసు కానీ దాస్ మావయ్య నిజం చెప్పేవరకు అని ఆలోచిస్తున్నాడని కార్తీక్ అంటాడు. దాస్ బాబాయ్ నిజం చెప్తాడు కదా అని దీప అనగానే చెప్పడు అని కార్తీక్ అంటాడు. అంటే బాబాయ్ ఎక్కడున్నాడో నీకు తెలుసా అని దీప అనగానే తెలుసు కానీ సమయం వచ్చినప్పుడు వస్తాడని కార్తీక్ అంటాడు. మరొకవైపు స్వప్న, కాశీ భోజనం చేస్తుంటే శ్రీధర్ వస్తాడు. కాశీ పది లక్షల అప్పు తీర్చిన విషయం చెప్తాడు.
ఆ తర్వాత జ్యోత్స్న, పారిజాతం మాట్లాడుకుంటుంటే దీప కాఫీ తీసుకొని వస్తుంది. ఎందుకు మేమ్ తీసుకొని రమ్మనకముందే వచ్చావని పారిజాతం కోప్పడుతుంది. ఆ తర్వాత కార్తీక్ వచ్చి గౌతమ్ వాళ్ళ అమ్మ పూజ జరిపించిన ఎంగేజ్ మెంట్ రింగ్స్ కోసం పంపించిందని శివన్నారాయణకి చెప్తాడు. ఇవి జ్యోత్స్నలకి ఇవ్వండి అని సుమిత్రకి ఇస్తాడు కార్తీక్. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.