English | Telugu
Karthika Deepam2: త్వరలో శౌర్య చచ్చిపోతుందన్న జ్యోత్స్న.. ఏడ్చేసిన దీప!
Updated : Jan 27, 2025
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika deepam 2).ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -265 లో.....శౌర్య ప్రాణాలు కాపాడానికి సాయం కోసం శివన్నారాయణ ఇంటికి వెళ్తుంది కాంచన. అతను సాయం చెయ్యకపోగా అవమానిస్తాడు. నా మనవరాలిని కాపాడమని కాంచన రిక్వెస్ట్ చేస్తుంటే.. అది నీ కొడుకుకి పుట్టిందా అని శివన్నారాయణ అంటుంటే.. అప్పుడే కార్తీక్ వస్తాడు. ఎందుకు ఇక్కడికి వచ్చావ్ అమ్మ ఎలా మాట్లాడుతున్నారో చూసావ్ కదా అని కార్తీక్ అంటాడు.
కార్తీక్ మాటలకి ఇంకా రెచ్చిపోయిన శివన్నారాయణ తన కూతురికి బాగోలేకపోతే తనే రావాలి కదా.. మిమ్మల్ని పంపించి బయట ఉందా అని వెటకారంగా మాట్లాడతాడు.. ఈ విషయం దీప కి తెలియదు.. ప్లీజ్ నాన్న సాయం చెయ్యండి అని శివన్నారాయణని కాంచన అడుగుతుంది. దాంతో సరే చేస్తాను. ఆ దీపని అడగమని చెప్పండి ఇస్తానని శివన్నారాయణ అంటాడు. నా భార్య వచ్చి బ్రతిమాలితే ఇస్తావా అని కార్తీక్ కోపంగా మాట్లాడతాడు. శివన్నారాయణ ఇంకా అవమానిస్తే నీకు పుట్టగతులు ఉండవ్ నాన్న అని కాంచన అనేస్తుంది. దాంతో శివన్నారాయణ ఎమోషనల్ అవుతాడు. ఆ తర్వాత నేనేదో నోరు జారాను నాన్న అని కాంచన రిక్వెస్ట్ చేస్తుంది. నా ప్రాణం అడ్డు పెట్టి అయిన సరే నా కూతురుని కాపాడుకుంటానని కార్తీక్ అంటాడు. ఇంకొకసారి ఇలా రాకండి అని శివన్నారాయణ అనగానే.. మీరు అవసరం ఉండి వస్తారు అంతే కానీ ఈ గుమ్మం తొక్కమని కాంచన వాళ్ళని తీసుకొని వెళ్తాడు కార్తీక్.
మరొక్కసారి మన కంటే ఆ దీప ఎక్కవ అని నిరూపించారని శివన్నారాయణ అంటాడు. ఈ విషయం దీపకి తెలియదా అని చెప్పాలని దీప దగ్గరికి జ్యోత్స్న వస్తుంది. నీ కూతురు గురించి నిజం చెప్తానంటూ శౌర్య గురించి జ్యోత్స్న చెప్తుంది. ఇక ఆపరేషన్ చెయ్యకపోతే బ్రతకదు. ఇప్పుడే డబ్బుల కోసం మా అత్త మీ అత్త మా ఇంటికి వచ్చారు.. బావ కూడా వచ్చాడు. ఇప్పుడు శౌర్య హాస్పిటల్ లో ఉందని జ్యోత్స్న చెప్పగానే.. దీప షాక్ అవుతుంది. జ్యోత్స్న వెళ్లిపోయాక దీప ఏడుస్తూ కార్తీక్ మాటలు గుర్తుచేసుకుంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.