English | Telugu
Eto Vellipoyindhi Manasu : సవతి తల్లి ప్రేమని తెలుసుకున్న కొడుకు.. భార్యతో ప్రేమగా ఉంటున్న సీతాకాంత్!
Updated : Jan 27, 2025
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఏటో వెళ్లిపోయింది మనసు'(Eto Vellipoyindhi Manasu). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -312 లో.....రామలక్ష్మి తెలివిగా భద్రాన్ని పట్టుకొని పోలీసుల ముందుకు తీసుకొని వస్తాడు. దాంతో శ్రీలత వాళ్ళు షాక్ అవుతారు. నా పేరుని నమ్మి వెంచర్ లో పెట్టుబడి పెట్టిన వాళ్ళు అందరికి డబ్బు మీరే ఇవ్వండి అని సీతాకాంత్ పోలీసులకి చెప్తాడు. దాంతో పాటు ఈ ఫ్రాడ్ భద్రం గాడిని కూడా అప్పగిస్తున్నాను.. మీ వాళ్లే మీకు ఎందుకు ఇలా చేశారని మీడియా వాళ్ళు సీతాకాంత్ ని అడుగుతారు. దానికి సమాధానం రామలక్ష్మి చెప్తుంది. వాళ్లే ఇలా చేశారు. ఇంకా ఆవిడ అయితే తల్లి అనే పదానికి తలవంపులు తెచ్చిందంటూ శ్రీలత గురించి చెప్పబోతుంటే.. 'రామలక్ష్మి' అని పిలిచి సీతాకాంత్ ఆపుతాడు.
ఇక జరిగింది నా మంచికే అనుకుంటూ నేనొక నిర్ణయం తీసుకున్నాను. నాకు నా భార్య రామలక్ష్మి ఈ కుటుంబంతో ఏ సంబంధం లేదని మీడియా ద్వారా చెప్తున్నామని సీతాకాంత్ చెప్తాడు. భద్రాన్ని పోలీసులు తీసుకొని వెళ్తుంటే. వాళ్ళు కూడా నాతో పాటు ఫ్రాడ్ చేశారంటూ ధన సందీప్ ల గురించి చెప్పగానే.. వాళ్ళను కూడా పోలీసులు అరెస్ట్ చేసి తీసుకొని వెళ్తారు. దాంతో శ్రీలత.. నాన్న సీతా అంటూ పిల్వగానే.. రామలక్ష్మి ఇక ఎవరు లేరు.. నాకు నువ్వు.. నేను నేను అంటూ రామలక్ష్మిని తీసుకొని వెళ్ళిపోతాడు. శ్రీవల్లి బాధపడుతూ మీ కొడుకు అంటే ప్రేమ లేదా అంటూ శ్రీవల్లి మాట్లాడుతుంటే.. వాడు నా కన్నకొడుకు ఆ రామలక్ష్మి పని చెప్తానంటూ శ్రీలత ఎవరికో కాల్ చేస్తుంది. రామలక్ష్మి వంట చేస్తుంటే నేను చేస్తానంటూ సీతాకాంత్ వంట చేస్తాడు. ఇద్దరు కలిసి భోజనం చేస్తారు. రామలక్ష్మి నిద్రలో కొంతమంది రౌడీలు వచ్చి సీతాకాంత్ ని పొడిచినట్లు కల వస్తుంది. దాంతో ఒక్కసారిగా బయపడి గట్టిగా అరుస్తుంది రామలక్ష్మి. ఏమైందని సీతాకాంత్ అడుగగా.. ఏం లేదని రామలక్ష్మి అంటుంది.
ఏంటి ఇలా వచ్చిందని రామలక్ష్మి టెన్షన్ పడుతుంది. మరుసటిరోజు శ్రీలత లాయర్ ని తీసుకొని స్టేషన్ కి వెళ్తుంది. దాంతో ధన , సందీప్ లు హ్యాపీగా ఫీల్ అవుతూ.. మేము వెళ్తున్నామంటూ భద్రంతో చెప్తారు. మీరు వెళ్ళరన్నట్లు ఒక నవ్వు నవ్వుతాడు. అక్కడ సీతాకాంత్ ఫ్రెండ్ ఉంటాడు. నువ్వు సీతాకాంత్ ఫ్రెండ్ వి కదా ఈ బెయిల్ తీసుకొని వాళ్ళని వదిలి పెట్టమని శ్రీలత అంటుంది. అది కుదరదని సీఐ అంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.