English | Telugu

శీఘ్రమేవ కల్యాణ ప్రాప్తిరస్తు...శ్రీముఖికి నెటిజన్స్ ఇస్తున్న విషెస్

టాలీవుడ్ స్టార్ యాంకర్ శ్రీముఖి గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. టీవీ షోస్, ఈవెంట్స్ చేస్తూ బుల్లితెర మీద ఎప్పుడూ బిజీగా ఉంటూ ఉంటుంది. అలాంటి శ్రీముఖి రీసెంట్ గా తిరుమల వెళ్ళింది. అలాగే ఇప్పుడు అరుణాచల శివుడిని దర్శించుకుని ఆలయంలో ప్రత్యేక పూజలు చేసింది. ఐతే "సంక్రాంతికి వస్తున్నాం" ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ లో యాంకర్ శ్రీముఖి రామ లక్ష్మణ్ ను ఫిక్షనల్ క్యారెక్టర్ అనడం పై చాలామంది ఫైర్ అయ్యారు. అయితే వెంటనే క్షమాఫణలు చెప్పడంతో వివాదం అక్కడితో ముగిసిపోయింది.

తర్వాత శ్రీముఖి మాములుగా తన షోస్ చేసుకుంటూ వెళ్తోంది. ఇక ఇప్పుడు ఆమె డివోషనల్ మోడ్ లోకి వెళ్ళింది. వరసగా అన్ని దేవాలయాలను సందర్శిస్తూ ప్రశాంతతను కోరుకుంటోంది శ్రీముఖి. ఇక ఈ పిక్స్ ని, వీడియోస్ ని కూడా ఆమె తన ఇన్స్టాగ్రామ్ పేజీలో పోస్ట్ చేస్తూ వస్తోంది. దాంతో నెటిజన్స్ కూడా రియాక్ట్ అవుతున్నారు. హర హర మహాదేవ, శీఘ్రమేవ కల్యాణ ప్రాప్తిరస్తు, ఈశ్వరానుగ్రహం ప్రాప్తిరస్తు...ఓం నమో అరుణాచల శివ, వైదీశ్వరన్ కోయిల్ కి రా అక్క అక్కడ నాడీ జ్యోతిష్యం చెప్తారు" అంటూ కామెంట్స్ చేస్తున్నారు. చెప్పాలంటే ఈ మధ్య కాలంలో శ్రీముఖి మూవీ ఈవెంట్స్ చేయడం మానేసింది. సుమ మాత్రమే చేస్తోంది. శ్రీముఖి టీవీ షోలతో చాలా బిజీ ఐపోయింది.