English | Telugu
Karthika Deepam2 : హోమానికి శ్రీధర్ ని పిలవడానికి వెళ్ళిన జ్యోత్స్న , పారిజాతం.. అతను వస్తాడా!
Updated : Nov 19, 2025
స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -518 లో.....జ్యోత్స్న, పారిజాతం కలిసి శ్రీధర్ రెండో పెళ్లి గురించి తప్పుగా మాట్లాడతారు. దాంతో శ్రీధర్ అక్కడ నుండి వెళ్ళిపోతాడు. ఈ జ్యోత్స్న నోటికి అడ్డు అదుపు లేకుండాపోయిందని కార్తీక్ తో దీప అంటుంది. వాళ్ళ సంగతి నేను చూసుకుంటానని కార్తీక్ అంటాడు. మరొకవైపు జ్యోత్స్న మాటలకు సుమిత్ర బాధపడుతుంది. రోజురోజుకి అలా తయారవుతుందని దశరథ్ తో అంటుంది. అప్పుడే కాఫీ తీసుకొని దీప ఎంట్రీ ఇస్తుంది. సుమిత్రని దశరథ్ రెస్ట్ తీసుకోమని చెప్తాడు.
దీపని బయటకు పిలిచి.. నా కూతురు కంటే మాపై నువ్వే ఎక్కువ ప్రేమ చుపిస్తావ్.. నిన్ను నా కూతురు అని అనుకుంటా.. నువ్వు ఈ ఇంట్లో ఎవరు ఏమైనా అంటే పట్టించుకోకని దీపతో దశరథ్ చెప్తాడు. ఆ తర్వాత చాలా రోజులకి ఈ ఇంట్లో మన మాట గట్టిగా వినిపించిందని జ్యోత్స్నతో పారిజాతం అంటుంది. అప్పుడే కార్తీక్ వచ్చి మిమ్మల్ని తాత రమ్మంటున్నాడని అంటాడు. అయితే ఏంటే మేం రాము అన్నట్లు పొగరుగా పారిజాతం మాట్లాడుతుంది. ఏదో మాట్లాడుతాడట అని కార్తీక్ అంటాడు. పారిజాతం, జ్యోత్స్న ఇద్దరు శివన్నారాయణ దగ్గరికి వెళ్తారు.
మీ వల్లే శ్రీధర్ హర్ట్ అయి వెళ్ళాడు.. ఇప్పుడు మీరు వాళ్ళ ఇంటికి వెళ్లి రేపటి హోమానికి పిలవాలని శివన్నారాయణ అంటాడు. మేమ్ వెళ్ళమని పారిజాతం అంటుంది. అయితే నీ వస్తువులు తీసుకొని ఈ ఇంట్లో నుండి వెళ్ళిపోమని పారిజాతంతో శివన్నారాయణ అంటాడు. ఇక పారిజాతం ఏం చెయ్యలేక సరే అంటుంది. జ్యోత్స్న, పారిజాతం ఇద్దరిని తీసుకొని శ్రీధర్ ఇంటికి వెళ్తాడు కార్తీక్. శ్రీధర్ కావాలనే వాళ్ళిద్దరు ఎవరు నాకు తెలియదు కార్తీక్ నువ్వు ఒక్కడివే ఇంట్లోకి రా అని శ్రీధర్ అంటాడు. అయిన పారిజాతం, జ్యోత్స్న ఇంట్లోకి వెళ్తారు. రేపు హోమానికి రమ్మని పిలుస్తారు. రానని శ్రీధర్ అంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.