English | Telugu

Brahmamudi : రాహుల్ పై జాలి చూపిస్తున్న కావ్య.. రాజ్ ఛాన్స్ ఇస్తాడా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -881 లో..... రాహుల్ రౌడీలతో పోరాడి డబ్బు తీసుకొని వస్తాడు. అదంతా అబద్ధం అని ఇంట్లో వాళ్ళు అంటారు. నిజమే అని సుభాష్ చెప్తాడు. నేను ప్రాణాలకి తెగించి డబ్బు కాపాడాను కానీ ఏం లాభం టెండర్ మిస్ అయిందని రాహుల్ గిల్టీగా ఫీల్ అవుతాడు. టెండర్ మిస్ అవ్వలేదు.. ప్లాన్ ఏ ఫెయిల్ అయితే ప్లాన్ బి ఇంప్లిమెంట్ చేసాను.. ఆల్రెడీ వేరే వాళ్ళతో మనీ పంపించాను బాబాయ్ టెండర్ వేసాడని రాజ్ చెప్తాడు. ఇంట్లో అందరు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు.

ఏ తర్వాత రాహుల్ దెబ్బలకి స్వప్న ఆంటిమెంట్ రాస్తుంది. రాహుల్ పై స్వప్న సింపథీ చూపిస్తుంది. మరొకవైపు రాహుల్ ని చుస్తే చాలా జాలిగా ఉంది. తను నిజంగానే మరిపోయాడని రాజ్ తో కావ్య చెప్తుంది. నేను వాడిని ఎప్పటికి నమ్మలేనని రాజ్ చెప్పగానే అలా అంటే ఎలా ఒక్క ఛాన్స్ ఇద్దామని కావ్య అంటుంది. సరే నీ కోసం ఒక్క ఛాన్స్ ఇస్తానని రాజ్ అంటాడు. ఆ తర్వాత రాహుల్ దగ్గరికి రుద్రాణి వస్తుంది. ఏంట్రా ఈ దెబ్బలు అని అడుగుతుంది. ఇదంతా ప్లాన్ లో ఒక భాగమే.. ఇప్పుడు అందరు నన్ను నమ్మడం మొదలు పెడుతారు. నువ్వు ఇప్పుడు నేను బాధలో తిండి కూడా తినడం లేదని అందరిలో పాజిటివ్ క్రియేట్ చెయ్ అని చెప్తాడు. దానికి రుద్రాణి సరే అంటుంది.

ఆ తర్వాత రాహుల్ తప్ప అందరు భోజనానికి వస్తారు. పాపం వాడికి తినాలని లేదట అని రుద్రాణి అంటుంది. ఎందుకు వాడి వల్లే ఇంత టెన్షన్ గా టెండర్ వేయాల్సి వచ్చిందని ప్రకాష్ అంటాడు. స్వప్న నువ్వు వెళ్లి రాహుల్ ని తీసుకొని రా అని రాజ్ చెప్తాడు. కాసేపటికి రాహుల్ ని తీసుకొని స్వప్న వస్తుంది. నాకు ఆకలిగా లేదని రాహుల్ యాక్టింగ్ చేస్తాడు. తరువాయి భాగంలో సుభాష్, అపర్ణ పెళ్లి రోజున వాళ్ళకి పెళ్లి చూపులు ఏర్పాటు చేస్తారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Sanjana Gets Zero Points: జీరోగా సంజన.... హౌస్ మేట్స్ ఏకాభిప్రాయంతో జైల్లోకి!

బిగ్ బాస్ సీజన్-9 చివరి దశకి వచ్చింది. సోమవారం రోజు నో నామినేషన్ అని బిగ్ బాస్ చెప్పాడు. కొన్ని పాయింట్స్ గల బాక్స్ లని గార్డెన్ ఏరియాలో పెట్టాడు. అందులో జీరో నుండి రెండున్నర లక్షల వరకు నెంబర్ గల బాక్స్ లు ఉంటాయి. ఎన్ని పాయింట్స్ కి ఎవరు అర్హులో వారికి ఆ పాయింట్స్ గల బాక్స్ ఇవ్వాలి.. పై నుండి ఎవరు అయితే ముందుగా బాల్ పట్టుకుంటారో వాళ్ళకే మనీ పాయింట్స్ ఇచ్చే ఛాన్స్ ఉంటుంది. మీరు ఇచ్చే పాయింట్స్ ని హౌస్ మేట్స్ ఇద్దరు అంగీకరించాలి.. కనీసం ఇద్దరు కూడా అంగీకరించకపోతే ఆ పాయింట్స్ అతనికి రద్దు అవుతాయని బిగ్ బాస్ చెప్తాడు...