English | Telugu
Karthika Deepam 2 : దాస్ కి అతిథి మర్యాదలు చేసిన శివన్నారాయణ.. ఓర్వలేని శ్రీధర్!
Updated : Jul 27, 2025
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2' (Karthika Deepam 2). ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -420 లో.... నా భార్య దశరథ్ మావయ్యని షూట్ చెయ్యలేదని నిరూపిస్తాను. లేదంటే దీప భర్తనే కాదని కార్తీక్ ఛాలెంజ్ చేస్తాడు. దాంతో జ్యోత్స్న టెన్షన్ పడుతూ ఒక ప్రాబ్లమ్ సాల్వ్ అయిందనుకుంటే ఇంకొక ప్రాబ్లెమ్ వచ్చిందని అనుకుంటుంది.
ఆ తర్వాత మాకు ఇంత హెల్ప్ చేసిన నువ్వు ఈ రోజు మాతో కలిసి భోజనం చెయ్యాలిసిందేనని దాస్ తో శివన్నారాయణ అంటాడు. దానికి దాస్ సరే అంటాడు. దీప నువ్వు వెళ్లి మంచి మంచి వంటలు చెయ్ అని దీపకి చెప్తాడు దశరథ్. మరొక వైపు పారిజాతంకి శ్రీధర్ ఫోన్ చేస్తాడు. ఎంగేజ్ మెంట్ ఆగిపోయిందట ఎలా అని అడుగుతాడు. నా కొడుకు దాస్ వల్ల అని పారిజాతం అనగానే.. అంత లేదు నా కొడుకు కార్తీక్ వల్ల అని శ్రీధర్ అంటాడు. లేదు దాస్ వల్ల కాబట్టే మా ఆయన దాస్ ని భోజనానికి ఉండమ్మన్నాడని పారిజాతం అనగానే ఇది నిజం అల్లుడు అని అంటుండగా అప్పుడే శివన్నారాయణ వస్తాడు. నీకు కొంచెం కూడా సిగ్గు లేదా వాడితో మాట్లాడుతున్నావని పారిజాతాన్ని శివన్నారాయణ తిడతాడు.
ఆ తర్వాత అందరు భోజనానికి వస్తారు. మీరు కూర్చోండి అని దీప, కార్తీక్ లతో దాస్ అంటాడు. మేం తర్వాత తింటామని కార్తీక్ అనగానే.. మీరు తింటేనే నేను తింటానని దాస్ అంటాడు. ఈ రోజు దాస్ మా అతిధి అతను చెప్పింది గౌరవిస్తాను. మీరు కూర్చోండి అని శివన్నారాయణ అనగానే దీప, కార్తీక్ కూర్చుంటాడు. దాంతో సుమిత్ర లేచి వడ్డిస్తుంది. సుమిత్ర చేత్తో దీపకి వడ్డించేలా చేస్తాడు కార్తీక్. ఆ తర్వాత శివన్ననారాయణ దాస్ తో ప్రేమగా మాట్లాడుతుంటే పారిజాతం సెల్ఫీ తీసుకుంటుంది. ఆ ఫోటో శ్రీధర్ కి పంపిస్తుంది. ఆ ఫోటో చూసి శ్రీధర్ కోపంగా మమ్మల్ని దూరం పెట్టి, వాడిని పక్కన కుర్చోబెట్టుకొని భోజనం పెడతారా అని కావేరితో చెప్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.