English | Telugu

నర్మదని సాగర్ క్షమిస్తాడా.. ప్రేమ ఎమోషనల్!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు' (Illu illalu pillalu). ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -221 లో... నర్మదని చూసి కూడా చూడనట్లు సాగర్ వెళ్లిపోతుంటే నర్మద బాధపడుతుంది. అప్పుడే భాగ్యం వచ్చి.. ఇలా భర్త చూసి కూడా చూడనట్లు వెళ్తే భరించడం చాలా కష్టం. ఈ అవమానంతో చచ్చిపోతారు కానీ నువ్వు అలా ఏం చెయ్యకని భాగ్యం వెటకారం గా మాట్లాడుతుంటే నర్మద బాధపడుతుంది. ఇంట్లో ఎవరు నీతో మాట్లాడడం లేదట కదా.. 'ఇలా వాళ్ళ బండారం బయటపెడతాను. వీళ్ళ బండారం బయటపెడతానంటే పరిస్థితి ఇలాగే ఉంటుంది' అని నర్మదకి వార్నింగ్ ఇస్తుంది భాగ్యం.

ఆ తర్వాత అందరు ఇంత హ్యాపీగా ఉంటే ఎలా అని.. పది అవుతుంది అందరు వెళ్లి పడుకోండి అని శ్రీవల్లి టీవీ అఫ్ చేస్తుంది. ధీరజ్ కోసం ప్రేమ బయట వెయిట్ చేస్తుంటే.. శ్రీవల్లి వచ్చి లోపలికి రా డోర్ వేస్తానని అంటుంది. ధీరజ్ రావాలి ఆగు అని ప్రేమ అంటున్నా వినకుండా శ్రీవల్లి డోర్ వేస్తుంది. ప్రేమ బయటే ఉంటుంది. మరొకవైపు సాగర్ దగ్గరికి నర్మద వచ్చి ఇలా చూసి కూడా చూడనట్లు వెళ్తే ఎంత బాధగా ఉంటుందని ఎమోషనల్ అవుతుంది. అయిన సాగర్ పట్టించుకోడు.

కాసేపటికి ధీరజ్ వస్తాడు. తను వచ్చేసరికి డోర్ వేసి ఉండడంతో ఎందుకు వేశారని ప్రేమని ధీరజ్ అడుగుతాడు. ప్రొద్దున శ్రీవల్లి రాజమత చెప్పారు కదా టైమ్ కి ఉండాలని అని ప్రేమ అంటుంది. అయ్యో ఇప్పుడెలా ఆకలిగా ఉందని ధీరజ్ అంటుంటే ప్రేమ ఇంటి కిటికీని కాయిన్ తో ఓపెన్ చెయ్యాలని ట్రై చేస్తుంది.

తరువాయి భాగంలో ప్రేమ ఇల్లు దులుపుతుంటే సేనాపతి చూసి ఎందుకు ఇంత కష్టం ఇప్పటికైనా మన ఇంటికి రా అంటాడు. ప్రేమ సైలెంట్ గా బాధపడుతూ లోపలికి వెళ్తుంటే వెనకాలే ఉన్న ధీరజ్, వేదవతి చూస్తుంటారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Sanjana Gets Zero Points: జీరోగా సంజన.... హౌస్ మేట్స్ ఏకాభిప్రాయంతో జైల్లోకి!

బిగ్ బాస్ సీజన్-9 చివరి దశకి వచ్చింది. సోమవారం రోజు నో నామినేషన్ అని బిగ్ బాస్ చెప్పాడు. కొన్ని పాయింట్స్ గల బాక్స్ లని గార్డెన్ ఏరియాలో పెట్టాడు. అందులో జీరో నుండి రెండున్నర లక్షల వరకు నెంబర్ గల బాక్స్ లు ఉంటాయి. ఎన్ని పాయింట్స్ కి ఎవరు అర్హులో వారికి ఆ పాయింట్స్ గల బాక్స్ ఇవ్వాలి.. పై నుండి ఎవరు అయితే ముందుగా బాల్ పట్టుకుంటారో వాళ్ళకే మనీ పాయింట్స్ ఇచ్చే ఛాన్స్ ఉంటుంది. మీరు ఇచ్చే పాయింట్స్ ని హౌస్ మేట్స్ ఇద్దరు అంగీకరించాలి.. కనీసం ఇద్దరు కూడా అంగీకరించకపోతే ఆ పాయింట్స్ అతనికి రద్దు అవుతాయని బిగ్ బాస్ చెప్తాడు...