English | Telugu
Karthika Deepam 2 : లేచిపోయి పెళ్ళి చేసుకుందాం.. చేయి కోసుకున్న ప్రేయసి!
Updated : Sep 22, 2024
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2 '(Karthika Deepam 2). ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -156 లో.....దీప వెళ్తుంటే నరసింహా ముసుగులో వచ్చి వెనకాల నుండి కత్తితో పొడవాలని ట్రై చేస్తాడు. దాంతో అది గమనించిన దీప వెంటనే చేతితో ఆపుతుంది. నీ సంగతి చెప్తానంటూ ఓ పెద్ద కర్ర తీసుకొని నరసింహాని కొట్టడానికి దీప అతని వెంటపడుతుంది. దాంతో నరసింహా పరుగెడతాడు. మరొకవైపు స్వప్న గురించి కాశీ ఆలోచిస్తాడు. అప్పుడే దాస్ వస్తాడు. నాన్న నా పెళ్లి గురించి మాట్లాడడానికి అక్క, నానమ్మ కలిసి స్వప్న వాళ్ళ ఇంటికి వెళ్లారని కాశీ చెప్తాడు. అవునా అయిన ఈ పెళ్లి జరగదని దాస్ అనగానే.. కాశీ షాక్ అవుతాడు. పారిజాతం ఈ విషయం ఎవరికి చెప్పకన్న విషయం దాస్ గుర్తు చేసుకొని.. కాశీకి నిజం చెప్పకుండా రెండు నెలలు ఆగు. ఈ విషయం లో తొందరపడకని దాస్ చెప్తాడు.
మరొకవైపు ఎందుకు నా ప్రేమని నాన్న అర్ధం చేసుకోవడం లేదని కావేరితో స్వప్న చెప్తూ ఎమోషనల్ అవుతుంది. ఆ కార్తీక్ బాబు నీ అన్నయ్య అని ఎలా చెప్పాలని కావేరి బాధపడుతుంది. ఆ తర్వాత శ్రీధర్ గురించి పారిజాతం, జ్యోత్స్న మాట్లాడుకుంటారు. మావయ్య చేసిన దాంట్లో తప్పేంటి? తాతయ్య కుడా రెండో పెళ్లి చేసుకున్నాడని జ్యోత్స్న అనగానే.. మీ నానమ్మ చనిపోయాక నన్ను పెళ్లి చేసుకున్నాడు. కానీ శ్రీధర్ కాంచన ఉండగానే పెళ్లి చేసుకున్నాడు. ఇప్పుడు ఈ విషయం మీ తాతయ్యకి తెలిస్తే మీ బావతో నీ పెళ్లి జరగదని పారిజాతం అంటుంది. అప్పుడే శివన్నారాయణ వస్తాడు. తాతయ్య మా ఫ్రెండ్ కి పెళ్లి ఫిక్స్ అయింది. ఆ తర్వాత అబ్బాయి ఫాదర్ రెండో పెళ్లి చేసుకున్నాడని తెలిసిందని జ్యోత్స్న చెప్పగానే వాళ్ళ ఫాదర్ ని తిట్టి, నేనైతే ఆ పెళ్లి ఆపేస్తానంటూ శివన్నారాయణ చెప్తాడు. దాంతో జ్యోత్స్న, పారిజాతం ఇద్దరు షాక్ అవుతారు. ఇక నీకు క్లారిటీ వచ్చిందా ఈ విషయం అందరికి తెలిసే కంటే ముందే నీ పెళ్లి జరగాలని జ్యోత్స్నతో పారిజాతం అంటుంది.
మరొకవైపు స్వప్న దగ్గరికి కాశీ వచ్చి.. మీ నాన్న ఒప్పుకోవడం లేదు. మా నాన్న రెండు నెలలు ఆగమని అంటున్నాడని కాశీ అంటాడు. ఎల్లుండి నా పెళ్లి అని స్వప్న చెప్తుంది. పదా మనం వెళ్లిపోయి పెళ్లి చేసుకుందామని కాశీ అంటుంటే.. నా కూతురిని తీసుకొని వెళ్తావా అంటూ శ్రీధర్ కర్రతో కాశీ ని కొడతాడు. దాంతో అది చూసిన స్వప్న కత్తితో తన చేయి కోసుకుంటుంది. వెంటనే స్వప్నని హాస్పిటల్ కి తీసుకొని వెళ్తారు. మరొకవైపు దీపకి కాశీ ఫోన్ చేసి జరిగింది మొత్తం చెప్తాడు. హాస్పిటల్ కి రమ్మని అనగానే దీప సరే అంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.