English | Telugu

Nagarjuna fires on Nikhil: ఆడింది సీత అయితే గుడ్డు సోనియాకి ఎందుకిచ్చావ్!

నిఖిల్, సోనియాలపై ఇండైరెక్ట్ గా పంచ్ లు వేశాడు‌ బిగ్ బాస్ హోస్ట్ అక్కినేని నాగార్జున. శనివారం నాటి ఎపిసోడ్ లో వచ్చీ రాగానే అభి మీద విరుచుకుబడిన నాగార్జున.. అందరికి తమ తమ పర్ఫామెన్స్ ఎలా ఉందో గుడ్లు తీసుకొచ్చి చెప్పాడు. అయితే సోనియాకి నిఖిల్ రెడ్ ఎగ్ ఇవ్వడంపై గట్టిగానే అడిగాడు. అదేంటో ఓసారి చూసేద్దాం. (Bigg Boss 8 Telugu)

నిఖిల్ ఈ వారం ఆడినటువంటి మెయిన్ టాక్స్ ఏంటి? అడిగారు నాగార్జున. 'ఎగ్ టాస్క్’ అని నిఖిల్ చెప్పాడు. ఎగ్ టాస్క్‌లో ఇంట్లో ఆడపిల్లలు ఎలా ఆడారు? అందులో ఎవరు బాగారు ఆడారని నాగార్జున అడుగగా.. అందరు బాగానే ఆడారు సర్ అని నిఖిల్ అంటాడు. కానీ అందరికంటే సోనియా బాగా ఆడింది అంతేకదా అని వెటకారంగా నాగార్జున అడుగగా.. అంటే నిజానికి గుడ్డ దగ్గర నేను ఎక్కువ ఉన్నాను కాబట్టి అంటూ నిఖిల్ ఏదో చెప్పబోతుంటాడు.

నేను అడుగుతున్న మాటకు సమాధానం చెప్పు అందరికన్నా ఎవరు బాగా ఆడారు అది చెప్పమని నాగార్జున అడుగగా.. అందరికన్నా బాగా గుడ్డు దగ్గర గొడవ పెట్టేసి విష్ణుప్రియ, సీతా స్ట్రాంగ్‌గా ఆడారంటు నిఖిల్ అన్నాడు. అంటే అవతల టీమ్‌లో ఎవరూ లేరా అని మళ్ళీ నాగ్ అడుగగా.. అవతల యష్మీ ప్రేరణ కూడా బాగా ఆడారు.. అందరిలోనూ సీత బాగా ఆడిందని నిఖిల్ అంటాడు. సీత బాగా ఆడింది. కానీ రెడ్ ఎగ్ మాత్రం సోనియాకు వెళ్లింది. ఆ విషయం తర్వాత మాట్లాడుకుందాం.. కూర్చోమని నిఖిల్‌ కి చెప్తాడు నాగార్జున.

Podharillu:పొదరిల్లు సీరియల్ లో సూపర్ ట్విస్ట్.. మహాలక్ష్మికి పెళ్ళి ఫిక్స్!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -02 లో.....మహాలక్ష్మి ప్రాజెక్ట్ డిజైన్ రెడీ చేసి హాల్లోకి వస్తుంది. వాళ్ళ నాన్న ప్రతాప్ ఇంకా అన్నయ్య మహాలక్ష్మికి డెస్టినేషన్ వెడ్డింగ్ ప్లాన్ చేస్తారు. ఒకసారి చూడు మహా అని వాళ్ళ అన్నయ్య అంటాడు. నాకేం ఇప్పుడు పెళ్లి వద్దు అవసరం అయితే వదిన నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకోండి అని మహా అంటుంది. ఇప్పుడు డిజైన్స్ చూపించడానికి వెళ్తున్నానని తెలిస్తే డాడీ వద్దని అంటాడనుకొని డాడీ కాలేజీలో సర్టిఫికెట్ ఉన్నాయి తెచ్చుకుంటానని చెప్తుంది.