English | Telugu

ఆధారాల‌తో డాక్ట‌ర్ బాబుని బుక్ చేసిన మోనిత‌!

బుల్లితెర సీరియ‌ల్స్‌లో టాప్ వ‌న్‌లో నిలుస్తూ సంచ‌ల‌నం సృష్టిస్తున్న సీరియ‌ల్ `కార్తీక దీపం`. గ‌త కొంత కాలంగా మహిళా ప్రేక్ష‌కుల నీరాజ‌నాలందుకుంటోంది. ఈసీరియ‌ల్‌తో వంట‌ల‌క్క దీప సెల‌బ్రిటీగా మారిన విష‌యం తెలిసిందే. ఇక రేటింగ్ పరంగానూ ఈ సీరియ‌ల్ దేశ వ్యాప్తంగా టాప్ వ‌న్‌లో నిలిచి ప‌లువురిని ఆశ్చ‌ర్చానికి గురిచేసింది. గ‌త కొంత కాలంగా అనూహ్య మ‌లుపుల‌తో సాగుతున్న ఈ సీరియ‌ల్ ఈ బుధ‌వారం 1211వ ఎపిసోడ్‌లోకి ఏంట‌ర‌వుతోంది.

ఈ సంద‌ర్భంగా ఈ రోజు హైలైట్స్ ఏంటో ఒక‌సారి చూద్దాం. కార్తీక్‌ని డాక్ట‌ర్స్ యూనియ‌న్‌కి ప్రెసిడెంట్‌ని చేయాల‌ని అంతా ఏక‌గ్రీవంగా ఆమోదిస్తారు. ఇందుకు సంబంధించిన డాక్ట‌ర్స్ మీటింగ్ కోసం కార్తీక్‌, దీప బ‌య‌లుదేరుతూ .. భార‌తికి ఫోన్ చేసి అక్క‌డికి మోనిత వ‌స్తుందా లేదా అని క‌నుక్కుంటారు. ఆ త‌రువాత మోనిత‌కు కాల్ చేసిన భార‌త త‌ను రావ‌డం లేద‌ని క‌న్ఫ‌ర్మ్ చేసుకుని అదే విష‌యాన్ని డాక్ట‌ర్ బాబు కార్తీక్‌కు చెబుతుంది. విష‌యం తెలిసి ఊపిరి పీల్చుకున్న కార్తీక్‌, దీప డాక్ట‌ర్స్ మీటింగ్‌కి బ‌య‌లుదేర‌తారు. వారి వెన‌కే సౌంద‌ర్య‌, ఆనంద‌రావులు కూడా వెళ‌తారు.

మీటింగ్‌కి వెళ్లిన కార్తీక్‌, దీప‌లని డాక్ట‌ర్ భార‌తి, ర‌వి సాద‌రంగా ఆహ్వానిస్తూ డాక్ట‌ర్స్ అసోసియేష‌న్‌కి ప్రెసిడెంట్‌గా మిమ్మ‌ల్ని ఏక‌గ్రీవంగా ఎన్నుకున్నారని చెబుతారు. నాకు ఎలాంటి ప‌ద‌వులు అవ‌స‌రం లేద‌ని కార్తీక్ అంటాడు. అయినా భార‌తి ప‌ట్టించుకోకుండా స్టేజ్‌పైకి వెళ్లి కార్తీక్‌ని పొగ‌డ్త‌ల‌తో ముంచెత్తుతుంది. దీంతో మ‌రీ ఎక్కువైంద‌ని భావించిన కార్తీక్ ఇక చాలు భార‌తి ఆపేయ్ అంటాడు. ఆ త‌రువాత సౌంద‌ర్య స్టేజ్ పైకి వెళ్లి కార్తీక్ చిన్న‌ప్పుడు అల్ల‌రి గురించి, అత‌ని మ‌న‌సు గురించి మాట్లాడుతుండ‌గా `కార్తీక్ గురించి నాకే బాగా తెలుసు` అంటూ మోనిత త‌న బిడ్డ‌తో.. ప‌క్క‌నే ప్రియ‌మ‌ణితో ఎంట్రీ ఇస్తుంది.

అడ్డు వ‌చ్చిన భార‌తిని ప‌క్క‌కు నెట్టి సౌంద‌ర్య‌ని మాట్లాడ‌నివ్వ‌కుండా చేసి జ‌ర‌గండి ఆంటీ నేను మాట్లాడాలి అంటూ స్టేజ్ ఎక్కుతుంది మోనిత‌. కార్తీక్ గురించి అత‌ని భార్య‌కే తెలుస‌ని వాళ్ల అమ్మ‌గారు అన్నారు. కానీ వాళ్లు 11 ఏళ్లు దూరంగా వుండి ఈ మ‌ధ్యనే క‌లిశార‌ని వెట‌కారంగా అంటుంది. ఆ మాట‌ల‌కు కార్తీక్‌కు చిర్రెత్తుకొస్తుంది. ఆ త‌రువాత ఏం జ‌రిగింది? .. మోనిత చూపించిన సాక్ష్యాలేంటీ?.. డాక్ట‌ర్ బాబు నిజంగానే మ‌రోసారి అడ్డంగా బుక్క‌య్యాడా? .. ఏం జ‌రిగింది అన్న‌ది తెలియాలంటే ఈ రోజు ఎపిసోడ్ చూడాల్సిందే.