English | Telugu

కొత్తింటికి వచ్చిన బహుమతులు చూసి పొంగిపోయిన కెవ్వు కార్తిక్

కెవ్వు కార్తీక్ జబర్దస్త్ కమెడియన్ గా మంచి పేరు సంపాదించి ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. జీవితంలో ఎన్నో కష్టాలు పడి ఒక్కో మెట్టు ఎదుగుతూ వచ్చాడు. షోస్ లో చేస్తూ ఒక్కో రూపాయి కూడబెట్టి సొంతింటిని సమకూర్చుకున్నారు కూడా. ఇక తన హౌస్ వార్మింగ్ ఫంక్షన్ కి చాలా మంది ఫ్రెండ్స్, స్కూల్ ఫ్రెండ్స్, కాలేజీ, ఇంజనీరింగ్ ఫ్రెండ్స్, రియాలిటీ షోస్ లో కలిసి చేసిన మిత్రులంతా హాజరయ్యారు. ఐతే ఈ ఫంక్షన్ కి వచ్చిన వాళ్లంతా బోల్డన్ని గిఫ్ట్స్ కూడా ఇచ్చారు కార్తీక్ కి.

సుమారు 700 మందికి పైగా కార్యక్రమానికి హాజరయ్యారని గిఫ్ట్స్ అన్ బాక్సింగ్ వీడియొలో చెప్పుకొచ్చాడు. కాకపొతే కొంత మంది హాజరు కాలేకపోయినా తమ ఇంట్లో వాళ్ళతో గిఫ్ట్స్ పంపించారని ఈ సందర్భంగా వాళ్లకు ఈ వీడియొ ద్వారా ప్రత్యేక కృతఙ్ఞతలు కూడా చెప్పుకున్నాడు. చమ్మక్ చంద్ర వినాయకుడి లామినేషన్, ఆటో రాంప్రసాద్ డైనింగ్ సెట్, నరేష్ రెండు ఏనుగు బొమ్మలు, ఇంకా మిమిక్రీ ఆర్టిస్ట్స్, రాకెట్ రాఘవ ఇచ్చిన గిఫ్ట్స్ అన్ని ఓపెన్ చేసి తన ఛానల్ ఫాలో అయ్యేవాళ్లందరి కోసం వీడియొ చేసి పెట్టాడు. ఎక్కువగా దేవుడి బొమ్మలు, గోడ గడియారాలు, కిచెన్ సెట్స్, జ్యుసర్ సెట్స్ వచ్చాయి. ఇక నెటిజన్స్ కూడా కార్తీక్ కి విషెస్ చెప్పారు. ఇంకా తాను పుట్టి పెరిగిన ఊరుకి సంబంధించి ఒక హోమ్ టూర్ వీడియొ చేయమంటూ కూడా చాలామంది కార్తిక్ ని అడిగారు.