English | Telugu

Illu illalu pillalu : నర్మద, సాగర్ ల అనుబంధం.. పెద్దావిడ కళ నెరవేరింది!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -64 లో..... ప్రేమ, ధీరజ్ లతో వేదవతి పూజ చేపిస్తుంది. అది చూసి భద్రవతి, సేనాపతి లు కోపంగా ఉంటారు. వేదవతి తన మేనకోడలి కోసం నెక్లెస్ తీసుకొని వచ్చి తన మెడలో వేస్తుంది. ఇది నీ పెళ్లి కోసం తీసుకున్న కానీ ఇప్పుడు నా కోడలికి నా చేతుల మీదుగా వేస్తున్నానంటూ మురిసిపోతుంది. అదంతా చూస్తున్న పెద్దావిడ హ్యాపీగా ఫీల్ అవుతుంటే.. పక్కనున్న భద్రవతి మాత్రం కోపంతో రగిలిపోతుంది.

పెద్దావిడ ప్రేమ, ధీరజ్ ల దగ్గరికి వచ్చి.. నా మనవడు, మనవరాలు అంటూ మురిసిపోతు త్వరగా ఆశీర్వాదం తీసుకోండి.. మళ్ళీ వాళ్ళు వస్తారని అంటుంది. ప్రేమ ధీరజ్ లు పెద్దావిడ దగ్గర ఆశీర్వాదం తీసుకుంటారు. నర్మద జాతరలో ఏది కొనివ్వమన్నా కూడా సాగర్ చిరాకుపడతాడు ఈ గాజులు బాగున్నాయని నర్మద అంటుంది. చిరాకుగా సాగర్ వెళ్లిపోతాడు.. అదంతా నర్మద పేరెంట్స్ చూస్తారు. వాడు నిన్ను బానే చూసుకుంటున్నాడంటూ కోపంగా మాట్లాడుతారు. లేదు నాన్న సాగర్ నన్ను బాగా చూసుకుంటున్నాడని నర్మద అంటుంది. అయినా మాకెంటి నిన్ను వద్దని అనుకున్నామని వాళ్ళు వెళ్ళిపోతారు. ఎందుకు ఇలా చేసావ్ సాగర్ మా వాళ్ళు తప్పుగా అపార్ధం చేసుకొని.. నేను హ్యాపీగా లేనని బాధపడుతున్నారని నర్మద అనుకుంటుంది. అటుపక్కన తిరిగి చూసేసరికి నర్మదకి ఇష్టమైన గాజులు ఎవరో తీసుకుంటే.. అవి మా భార్యకి నచ్చాయి పెళ్లి అయ్యాక నేను ఇచ్చే మొదటి గిఫ్ట్ ఇవ్వండి అని వాళ్ళని రిక్వెస్ట్ చేసి గాజులు తీసుకుంటాడు. అదంతా చూసిన నర్మద.. సాగర్ దగ్గరికి వచ్చి నాకు తెలుసు నేను బాధపడితే చూడలేవని అంటుంది. నర్మద చేతికి సాగర్ గాజులు తొడుగుతాడు.

ప్రేమ, ధీరజ్ ల క్లాస్ మేట్స్ అక్కడికి వస్తారు. మీరు పెళ్లి చేసుకున్నారా ఆ విషయం మాకు చెప్తే మేమే చేసేవాళ్ళం కదా అని ఆటపట్టిస్తారు. ఇద్దరు కలిసి ఫోటో తీసుకోండి అంటూ ప్రేమపై చెయ్ వెయ్ ఇలా దిగండి.. అలా దీగండి అంటూ ఫొటోస్ తీస్తుంటే ప్రేమ ధీరజ్ లు ఇబ్బందిపడతారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.