English | Telugu
Illu illalu pillalu : ధీరజ్ పై జాలి చూపిస్తున్న ప్రేమ.. వాళ్ళిద్దరు కలుస్తారా!
Updated : Jun 22, 2025
స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -191 లో... ప్రేమ, నర్మద, వేదవతి కలిసి ధీరజ్, రామరాజులకి మాటలు కలపాలని చూస్తారు. రామరాజు భోజనానికి వస్తాడు. రామరాజు వచ్చి భోజనం చేస్తుంటే అప్పుడే ధీరజ్ ని ప్రేమ భోజనానికి పంపిస్తుంది. రామరాజు పక్కన ధీరజ్ వచ్చి కూర్చొని భోజనం చేస్తుంటే రామరాజు వెళ్ళిపోతాడు. దాంతో ధీరజ్ కూడా వెళ్ళిపోతాడు.
ధీరజ్ దగ్గరికి వేదవతి వచ్చి ఎందుకిలా చేసావని అడుగుతుంది. నాన్నకి నాపై కోపం ఉంది. ఈ కోపం అంతా నేను ప్రేమని పెళ్లి చేసుకున్నప్పటి నుండి మొదలైందని ధీరజ్ అంటుంటే ప్రేమ అదంతా విని బాధపడుతుంది. ఆ తర్వాత వేదవతి ఒంటరిగా కూర్చొని బాధపడుతుంటే.. అప్పుడే నర్మద, ప్రేమ వస్తారు. సాగర్, చందు ఆయన చెప్పింది వింటారు కానీ చిన్నోడు తనకి నచ్చింది చేస్తాడని అంటాడు. ఇలా చాలాసార్లు గొడవ జరిగాయి కానీ ఇప్పుడు అలా కాదు అసలు చిన్నోడు మాటలు పడడానికి కారణం నేనే.. ఆ రోజు వాడు ప్రేమని పెళ్లి చేసుకుంది నా వల్లేనని వేదవతి బాధపడుతుంది. ఇక నేను వెళ్లి నా వల్లే ఈ పెళ్లి జరిగిందని చెప్తానని వేదవతి అనగానే వద్దు ఇన్ని రోజులు నా దగ్గర దాచి మోసం చేసారని అనుకుంటాడని నర్మద అంటుంది.
ఆ తర్వాత ధీరజ్ డల్ గా ఉంటాడు. పాపం వాళ్ళ నాన్న కొట్టినందుకు బాధపడుతున్నాడు.. ఆ బాధని పోగొట్టాలని ప్రేమ అనుకొని ధీరజ్ దగ్గరికి వచ్చి కూర్చుంటుంది. తరువాయి భాగంలో రేపు ఎగ్జామ్స్ ఉన్నాయ్ చదువుకోమని ప్రేమ అనగానే.. నిద్రొస్తుందని ధీరజ్ పడుకుంటాడు. వద్దని ధీరజ్ ని నిద్ర లేపి బుక్ చేతికి ఇస్తుంది ప్రేమ. ధీరజ్ నిద్రపోతు ప్రేమ కాళ్లపై పడతాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.