English | Telugu
గౌతమ్ కృష్ణ ఎలిమినేటెడ్.. లేదంటే నాగార్జున తాట తీస్తాడుగా!
Updated : Nov 11, 2023
బిగ్ బాస్ సీజన్-7 లో ఒక్కో కంటెస్టెంట్ ఒక్కో స్ట్రాటజీతో ఆసక్తిని కలిగిస్తున్నారు. ఈ వారం మొత్తం ఫ్యామిలీ వీక్ సాగింది. అందరి హౌస్ మేట్స్ ఫ్యామీలీ వాళ్ళు వచ్చి ఎమోషనల్ అయ్యారు. అయితే ఇందులో కొంతమంది కొన్నింటిని బాగా నేర్చుకున్నట్టు తెలుస్తుంది.
ఈ వారం హౌస్ కి కొత్త కెప్టెన్ కోసం ఒక టాస్క్ ఇచ్చాడు బిగ్ బాస్. కంటెస్టెంట్స్ కి ఓ బేబీ అంటూ బేబీ డాల్స్ టాస్క్ ఇచ్చాడు బిగ్ బాస్. గార్డెన్ ఏరియాలో ఏర్పాటు చేసిన ఒక గేట్ తో కూడిన సెటప్ చేశాడు. గేట్ కి అపోజిట్ లో టేబుల్ పెట్టి దాని మీద కంటెస్టెంట్స్ ఫేస్ లతో డాల్స్ కి పెట్టాడు. బెల్ సౌండ్ వచ్చిన ప్రతీసారీ కంటెస్టెంట్స్ అంతా ఆ బొమ్మలు తీసుకొని గేట్ లోకి పరుగెత్తాలి. ఏ కంటెస్టెంట్ అయితే గేట్ లోకి చివరగా వెళ్తాడో అతడి చేతిలో ఉన్న బేబీ డాల్ మీద కంటెస్టెంట్ ఆట నుండి తప్పుకుంటాడు. ఇలా మొదట యావర్, అశ్విని, భోలే, శోభా, ప్రియాంక, రతిక, అమర్ దీప్ ఆటనుండి తప్పుకొని చివరగా అంబటి అర్జున్, గౌతమ్, శివాజీ మిగులుతారు.
అయితే వీరి ముగ్గురు పరుగెత్తుకుంటూ వెళ్ళి డాల్స్ ని పట్టుకుంటారు. గౌతమ్, అంబటి అర్జున్ గేట్ లోకి వెళ్తారు. శివాజీ మిగిలిపోతాడు. అయితే శివాజీ చేతిలో గౌతమ్ కృష్ణ డాల్ ఉంటుంది. దాంతో గౌతమ్ కెప్టెన్సీ రేస్ నుండి తప్పుకోవాల్సి వస్తుంది. ఇక అంబటి అర్జున్, శివాజీ మిగులుతారు. గౌతమ్ కృష్ణని కావాలనే తప్పించారని, తనకి అన్యాయం జరిగిందని శివాజీతో వాదనకి దిగుతాడు గౌతమ్. ఇదంతా చూస్తున్న హౌస్ మేట్స్ ఏం అనలేకపోతారు. " ఇది గేమ్ స్ట్రాటజీ. నువ్వు తప్పుకునే ముందు అందరు తప్పుకున్నారు కదా. నువ్వు ప్రతీసారీ వాంటెడ్ గా నాతో గొడవ పెట్టుకుంటున్నావ్. ఇది కరెక్ట్ కాదు. నువ్వు కంటెంట్ కోసం ఎంత చేసినా అది సెట్ అవ్వదు" అంటూ గౌతమ్ మీద శివాజీ ఫైర్ అయ్యాడు. అయితే వీరిద్దరిలో ఎవరు కరెక్ట్ అంటూ నెట్టింట పెద్ద డిబేటే జరుగుతుంది. అయితే వందలో ఎనభై మంది శివాజీ కరెక్ట్ అని చెప్తున్నారు. దీంతో ప్రతీవారం లాగా ఈ వారం కూడా గౌతమ్ కృష్ణకి నాగార్జున చేతిలో గట్టి వార్నింగ్ పడేలా ఉంది.