English | Telugu
Pallavi Prashanth : నాన్నకు ప్రేమతో.. ఈ దెబ్బతో టైటిల్ విన్నర్ ఫిక్స్!
Updated : Nov 11, 2023
బిగ్ బాస్ సీజన్-7 ఈ వారం ఫ్యామిలీ వీక్ తో క్రేజీగా ఎమోషనల్ గా సాగుతుంది. హౌస్ లోకి మొదటగా శివాజీ కొడుకు వెంకట్ వచ్చాడు. ఆ తర్వాత అర్జున్ వాళ్ల భార్య, శోభాశెట్టి అమ్మ, భోలే భార్య, గౌతమ్ కృష్ణ అమ్మ, యావర్ అన్నయ్య.. ఇలా అందరు వచ్చి ఎమోషనల్ అయ్యారు. నిన్నటి ఎపిసోడ్ లో మొదటగా రతిక వాళ్ళ నాన్న రాములు వచ్చి అందరితో మాట్లాడాడు. ఆట బాగా ఆడమని, కప్పు కొట్టాలని పల్లవి ప్రశాంత్ కి రతిక వాళ్ల నాన్న చెప్పాడు.
ఇక హౌస్ లో అందరి ఫ్యామిలీ వాళ్ళు వచ్చారు. ఒక్క పల్లవి ప్రశాంత్ వాళ్ళ నాన్న రాకపోవడంతో పొద్దున్నుండి సాయంత్రం వరకు ఏమీ తినకుండా ఎదురుచూసాడంట ప్రశాంత్. శోభాశెట్టి, ప్రియాంక తినమని చెప్పిన తినని మొండిగా ఉన్నాడంట ప్రశాంత్. ఆ తర్వాత బంతిపూలని పంపించాడు బిగ్ బాస్. ఆ పూలని చూసిన శివాజీ.. ' రేయ్ పల్లవి.. మీ చేనులో పూసిన బంతిపూలు రా' అని చూపించడంతో కంటతడి పెట్టుకున్నాడు ప్రశాంత్. ఇక కాసేపటికి.. బాబు బంగారం అంటూ పల్లవి ప్రశాంత్ వాళ్ళ నాన్న హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చాడు. నాన్నని చూసిన ఆనందంలో పరుగున వెళ్ళి కాళ్ళమీద పడిపోయాడు ప్రశాంత్. నాన్నని పైకి ఎత్తుకొని.. జై కిసాన్ జై జవాన్. మళ్లొచ్చిన అంటే తగ్గేదేలా అంటూ అరవడంతొ బిగ్ బాస్ హౌస్ మొత్తం దద్దరిల్లిపోయింది. నా బిడ్డని మంచిగా చూసుకోండ్రి అని హౌస్ మేట్స్ అందరికి చేతులెక్కి మరీ మొక్కాడు. " గొడవలు పెట్టుకోకండి. కొట్టుకోకండి.. కలిసి మెలిసి ఉండండి" అంటూ అమర్ దీప్ తో పల్లవి ప్రశాంత్ వాళ్ళ నాన్న అన్నాడు. ఇక నాన్నకి ఆప్యాయంగా అన్నం తినిపించాడు పల్లవి ప్రశాంత్. ఓ ప్లేట్ లో అన్నం మెతుకుల్లా మీరంతా కలిసి మెలిసి ఉండాలే. ఎవరి ఆట వారిదే. ఆట అయిపోయాక అంతా మరిచిపోయి కుటుంబం మాదిరి ఉండాలి అని హౌస్ మేట్స్ తో అన్నాడు ప్రశాంత్ వాళ్ళ నాన్న.
ఇద్దరు కలిసి సపరేట్ గా మాట్లాడుకున్నారు. నీ ఆట నువ్వు ఆడు. వేరే ఏం వద్దు. గొడవలకి పోకు. కోపం తగ్గించుకో అని ప్రశాంత్ వాళ్ళ నాన్న చెప్పాడు. ఇక నాన్న వచ్చిన సందర్భంలో భోలే షావలి అప్పటికప్పుడు లిరిక్స్ అనుకొని పాట పాడాడు. " బాపొచ్చినాడు తమ్మయ్యా.. బంతి పూలు తెచ్చాడు తమ్ముడా.. వాగై వచ్చాడు.. వంకై వచ్చాడు.. పొలమై వచ్చాడు.. చేనై వచ్చాడు.. బువ్వై(అన్నం) వచ్చాడు " అంటూ భోలే షావలిని పాటకి హౌస్ అంతా ఫిధా అయ్యారు. విజిల్స్ , కేకలతో మారుమ్రోగింది. ఈ ఎపిసోడ్ అంతా మోస్ట్ ఎమోషనల్ గా సాగింది.