English | Telugu
Brahmamudi : దుగ్గిరాల ఇంట్లో ఆస్తి చీలికలు.. లెక్కలేసుకుంటున్న రుద్రాణి!
Updated : Nov 11, 2023
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'.ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -250 లో.. దుగ్గిరాల ఇంటికి రుద్రాణి ఏమి కాదని, కేవలం సీతారామయ్య చేరదీసి కూతురు స్థానం ఇచ్చి పెళ్లి చేసి పంపిస్తే తిరిగి వచ్చి దుగ్గిరాల ఇంట్లోనే అడపడుచు హోదాని ఏలూతుంటుంది. అయితే పెద్దాయన ఆరోగ్యం బాగా లేకపోవడంతో తనకి ఒక వంతు ఆస్తి కావాలని వీలునామా పత్రాలు తీసుకొని సీతారామయ్య దగ్గరికి వచ్చి రుద్రాణి నటిస్తుంటుంది..
మరొకవైపు రుద్రాణి సీతారామయ్య దగ్గరికి వెళ్ళడం ధాన్యలక్ష్మి చూసి షాక్ అవుతుంది. కాసేపటికి రాహుల్ దగ్గరికి రుద్రాణి వెళ్తుంది. ఏంటి మమ్మీ ఏడుస్తున్నావని రాహుల్ అనగానే .. ఏడవడం లేదు జీవిస్తున్నానని రుద్రాణి అంటుంది. ఇంతకి పెద్దాయన ఆస్తి రాసి ఇచ్చేలా ఉన్నాడా అని రాహుల్ అనగానే.. ఇవ్వకేం చేస్తాడని రుద్రాణి అంటుంది. ఇక సంతోషంగా ఇద్దరు కలిసి డ్రింక్ చేస్తు ఇంట్లో సిచువేషన్ గురించి వెటకారంగా మాట్లాడుకుంటారు. మరుసటి రోజు ఉదయం అందరిని టిఫిన్ చెయ్యడానికి కావ్య పిలుస్తుంటుంది. ఆ తర్వాత ఇంటికి లాయర్ వచ్చి సీతరామయ్య గదిలోకీ వెళ్తాడు. లాయర్ లోపలికి రాగానే ఇందిరాదేవిని బయటకు పంపిస్తాడు సీతారామయ్య. అసలు ఇంటికి లాయర్ ఎందుకు వచ్చాడని ఇంట్లో వాళ్ళంతా సందిగ్ధంలో ఉంటారు. ఆ తర్వాత ఆస్తుల గురించి సీతారామయ్య ఒక వీలునామా రాసి తీసుకొని రమ్మని చెప్పగానే లాయర్ సరే అని వెళ్ళిపోతాడు. ఒకవైపు రుద్రాణి, రాహుల్ లు తమ వాటాని ఇస్తున్నారని హ్యాపీగా ఉంటారు. మరొకవైపు ధాన్యలక్ష్మి ఆలోచిస్తుంటుంది. ఆ రుద్రాణి వల్ల ఆస్తిలో మన కళ్యాణ్ కి అన్యాయం జరుగుతుంది కావచ్చని ప్రకాష్ తో ధాన్యలక్ష్మి చెప్పగానే.. అదేం లేదు నేను అన్నయ్యని నమ్మాను. ఇప్పుడు రాజ్ ని కళ్యాణ్ నమ్ముతున్నాడు. వాళ్ళు ఎప్పుడు కరెక్ట్ గానే ఆలోచిస్తారని ప్రకాష్ అంటాడు.
మరొకవైపు సీతారామయ్య దగ్గరికి అపర్ణ వచ్చి.. మీరు ఇప్పుడు లాయర్ ని ఎందుకు పిలిచారో నాకు అర్థం అయింది. కానీ ఇన్ని రోజులు ఉమ్మడిగా ఉంటున్న మనకి ఇప్పుడు ఆస్తిలో చీలికలు వస్తాయి. ఇప్పుడు మీరు అలాంటి ఆస్తి చీలికలు చెయ్యకండి. ఎప్పటికి ఈ కుటుంబం ఉమ్మడిగా ఉండేలా ఇంటి పెద్ద కోడలిగా నేను బాధ్యత తీసుకుంటాను. ఇక ఆ తర్వాత మీ ఇష్టం అని చెప్పి అపర్ణ వెళ్ళిపోతుంది. మరొక వైపు సీతారామయ్యకి మంచి ట్రీట్ మెంట్ గురించి రాజ్ తెలిసిన వాళ్ళతో మాట్లాడతాడు. అప్పుడే కావ్య భోజనం తీసుకొని రాజ్ దగ్గరికి వస్తుంది. తరువాయి భాగంలో లాయర్ వీలునామ పత్రాలు తీసుకొని వచ్చి చదవబోతుంటే.. అప్పుడే రాజ్ వచ్చి వీలునామా పత్రాలు చింపివేసి.. ఇది ఇంతటితో వదిలెయ్యండని చెప్తాడు. రుద్రాణి ఒక్కసారిగా షాక్ అవుతుంది.. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే పూర్తి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.