English | Telugu

గీతు వర్సెస్ ఆదిరెడ్డి ఉండబోతుందా? ఇనయాకి హౌస్ మేట్స్ సింపతి ఉండనుందా?


అరవై వ రోజు "కెజిఎఫ్" మూవీలోని 'తుఫాన్ ..తుఫాన్' పాటతో మొదలైంది. కాగా బిగ్ బాస్ హౌస్ లో గత నాలుగు రోజులుగా కొనసాగుతోన్న టాస్క్ లో జరిగే గొడవలు తారా స్థాయికి చేరుకున్నాయి. ఒక వైపు గీతు-ఆదిత్య గొడవ, మరోవైపు రేవంత్-రోహిత్ గొడవ, ఇది చాలదు అన్నట్లుగా శ్రీహాన్-ఇనయాల మధ్య గొడవ కూడా జరుగుతుంది.

"గీతు ప్రతీదానికి ఇలా చేయడం కరెక్ట్ కాదు " అని ఆదిరెడ్డి అన్నాడు. ఈ టాస్క్ లో చనిపోయిన సభ్యులు భౌతికంగా పాల్లొనకూడదు అని బిగ్ బాస్ లెటర్ ద్వారా పంపించారు. "అన్ ఫెయిర్ బిగ్ బాస్. ఎవ్వరికి డౌట్ రాలేదు. అందరు కన్విన్స్ అయ్యారు. నేను సీక్రెట్ టాస్క్ సక్సెస్ ఫుల్ గా పూర్తి చేస్తాను. మమ్మల్ని సేవ్ చేయండి. మాకు ఒక రీవైవ్ చేయండి" అని ఆదిరెడ్డి బిగ్ బాస్ కి రిక్వెస్ట్ చేసాడు. ఆ తర్వాత ఆదిరెడ్డి టీం కి ఒక రీవైవ్ ఇచ్చాడు బిగ్ బాస్. ఆ తర్వాత శ్రీహాన్ సరదగా మాట్లాడుతూ, "రెస్పాండ్ అవ్వకపోతే ఇనయా ఎలా అవుతుంది" అని అన్నాడు. కాగా మరో వైపు తన టీ షర్ట్ పోయింది. ఎవరో తీసారు అని ఆదిరెడ్డి వెతికుతున్నాడు. ఫైమా, ఆదిరెడ్డి దగ్గరకి వచ్చి "నాకు గీతు మీదనే డౌట్" అని చెప్పింది. దీంతో ఆదిరెడ్డి మాట్లాడుతూ, "గీతు తీసింది. అని తెలిస్తే, ఇక గీతు వర్సెస్ ఆదిరెడ్డి అవుతుంది" అని ఫైమాతో చెప్పుకొచ్చాడు.

ఆ తర్వాత ఇనయా మాట్లాడుతూ, "నా ప్లేట్ పోయింది. నేను సూర్య ప్లేట్ లో తింటానని తెలుసు కదా. అయినా ఎందుకు తీసారు? ఎవరు తీసారు? " అంటు అరుస్తూ ఉండగా, రోహిత్ మాట్లాడుతూ, " అలా అరవకుండా, నిదానంగా మాట్లాడు" అని చెప్పాడు. "ప్రతీసారీ నన్నే ట్రిగ్గర్ చేస్తున్నారు. నేను తినను ఇక" అని ఇనయా ఏడుస్తు కూర్చుంది. ఫైమా, మెరీనా ఓదార్చినా తినలేకపోయేసరికి, కీర్తి భట్ కలుగచేసుకొని, " ఇది సూర్య కోసం తిను" అని అనగా , అప్పుడు తినేసింది ఇనయా. ఇలా ఇనయా అందరికి తనపై సింపతి చూపించాలనుకుంటోందని తెలుస్తోంది. కాగా హౌస్ మేట్స్ అందరు తనని గేమర్ అని అనుకుంటున్నారు.