English | Telugu
వర్ష, ఇమ్ము విడిపోయారు!
Updated : Nov 3, 2022
జబర్దస్త్ వేదికపై రీల్ లవ్స్ తో పాటు రియల్ లవ్స్‌ను కూడా చూశాం.. సుధీర్-రష్మీ, వర్ష-ఇమ్మానుయేల్, రాకేష్-సుజాత..ఇలా ఎందరో! ఐతే వర్ష-ఇమ్ము పెయిర్ ఒక రేంజ్ లో ఆడియన్స్ ని ఆకట్టుకుంది. వాళ్ళు కూడా తమ మధ్య నిజమైన ప్రేమ ఉన్నట్టుగానే నటించేవారు. వీళ్ళు చాలా స్కిట్స్ లో ప్రపోజ్ చేసుకున్నారు కూడా.. అలాగే "కోడలొస్తోందని మీ ఇంట్లో చెప్పు".. "అల్లుడొస్తున్నాడని మీ ఇంట్లో చెప్పు" అని కూడా సెటైర్స్ పేల్చుకున్నారు.
కానీ ఇప్పుడు కొంత కాలం నుంచి ఇద్దరి మధ్య చాలా గ్యాప్ వచ్చినట్టుక్లియర్ గా అర్ధమైపోతోంది. ఎందుకంటే ఇద్దరూ కలిసి సరిగా స్కిట్స్ చేయడం లేదు,వేరువేరుగా చేస్తున్నారు. ఆ విషయం రేపు రాబోయే 'శ్రీదేవి డ్రామా కంపెనీ' చూస్తే అర్థమైపోతుంది. ఇప్పుడు ఈ షో లేటెస్ట్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఇందులో "నువ్వంటే ప్రాణమని" అంటూ ఇమ్మానుయేల్ ఏడుస్తూ ఒక పాట పాడాడు. ఇక ఆడియన్స్ లో కూర్చున్న వర్ష కూడా చాలా డల్ గా కనిపించింది. ఈ పాటను పాడుతున్నంత సేపు ఇమ్ము-వర్ష గతంలో చేసిన స్కిట్ బిట్స్ ని ప్లే చేసి చూపించారు.
ఇంద్రజ ఆ పాట అయ్యాక "ఏమైంది?" అని అడిగింది. "అప్పటికీ ఇప్పటికీ ఏమీ మారలేదా మీ మధ్య?" అని రష్మీ కూడా అడిగింది. "అది ఎప్పటికీ మారదేమో అనిపించింది. అందుకే ఇలా చెప్పాల్సి వచ్చింది" అని ఇమ్ము అన్నాడు. పక్కనే వర్ష తల దించుకుని నిలబడింది. "ఏమైంది వర్షా?" అని ఇంద్రజ అడిగినా, ఆమె సమాధానం చెప్పలేదు.
ఇక ఇమ్ము వర్షని "మగాడు" అంటూ స్టేజి మీద ఎన్నో సార్లు అవమానించాడు.. ఐనా కొన్ని సార్లు సీరియస్ గా అలా అనొద్దని చెప్పింది.. కొన్ని సార్లు లైట్ తీసుకుంది. కానీ ఈసారి మాత్రం సీరియస్ గా డెసిషన్ తీసుకున్నట్టే కనిపిస్తోంది వర్ష. అసలింతకీ ఏమయ్యింది అనే విషయం తెలియాలంటే ఆదివారం వరకు వెయిట్ చేయాల్సిందే.