English | Telugu

కొనసాగుతోన్న రేవంత్ రోహిత్ మధ్య గొడవ!

బిగ్ బాస్ హౌస్ లో రోజు రోజుకి గేమ్ ఇంటెన్స్ లెవల్ పెరుగుతు వస్తోంది. మొన్న మొదలైన 'మిషన్ ఇంపాజిబుల్' టాస్క్ ఉత్కంఠభరితంగా కొనసాగుతుంది. అయితే ఈ టాస్క్ లో కంటెస్టెంట్స్ మధ్య జరుగుతోన్న గొడవలు పీక్స్ స్టేజ్ కి వెళుతున్నాయి.

మొన్న జరిగిన రేవంత్, రోహిత్ ల మధ్య గొడవ పెరుగుతుంది. నిన్న జరిగిన గేమ్ లో ఇరు జట్లు పోటాపోటీగా పాల్లొనగా, అందులో రేవంత్ అగ్రెసివ్ బిహేవియర్ వల్ల రోహిత్ మెరీనా బాధపడాల్సి వచ్చింది. అయితే గేమ్ మొదలయ్యాక రేవంత్ , రోహిత్ టీ షర్ట్ కి ఉన్న స్ట్రిప్స్ లాగే ప్రయత్నం చేసాడు. రోహిత్ చేతులతో డిఫెండ్ చేయగా, రేవంత్ కి గాయం అయింది. దీంతో ఒక్కసారిగా రేవంత్ హైపర్ అయ్యాడు. ఆ గాయం అయిన సెన్స్ లో ఏదో మాట జారాడు. అది రోహిత్ కి వేరేలా చేరింది. 'నీ యమ్మా అని అన్నావ్' అని రోహిత్ అన్నాడు. రోహిత్ కి సపోర్ట్ గా మెరీనా మాట్లాడుతూ, "రేవంత్ అలా మాట్లాడకూడదు. తప్పు. నీ యమ్మా అని అనొచ్చా" అని అనగా, "ఏ ఎవరన్నారు.నేనెందుకు అంటా నీ యమ్మా అని" అని రేవంత్ అన్నాడు. అయితే రేవంత్ కి, రోహిత్ ఏదో చెప్పబోతుండగా, "నువ్వు మాట్లాడకు..నువ్వు మాట్లాడకు" అని రేవంత్ కోపంగా అనేసాడు.

అయితే ఈ సీన్ కి ముందు ఆదిరెడ్డికి, రేవంత్ కి మధ్య కూడా ఇలాంటి గొడవనే జరిగింది. కానీ ఆదిరెడ్డి రెస్పెక్ట్ ఇస్తూ మాట్లాడటం వల్ల రేవంత్ సైలెంట్ అయ్యాడు. లేదంటే మరో గొడవ జరిగేది. కాగా రేవంత్ అగ్రెసివ్ అని హౌస్ మేట్స్ అందరికి తెలిసి, అతనితో జాగ్రత్తగా ఉంటూనే వస్తోన్నారు. అయితే రోహిత్ , రేవంత్ మధ్య జరిగిన ఈ గొడవ వరుసగా రెండో రోజుకి చేరుకుంది.