English | Telugu
బిగ్ బాస్ షో స్క్రిప్ట్ అని సంచలన వ్యాఖ్యలు చేసిన గీతు రాయల్!
Updated : Dec 26, 2023
బిగ్ బాస్ సీజన్ సిక్స్ లో చిరుతపులిలా తోటి కంటెస్టెంట్స్ ని ఒక ఆట ఆడుకున్న గీతు రాయల్.. ఇప్పుడు అందరికి తెలిసిందే. సీజన్ సెవెన్ కంటెస్టెంట్స్ కి బజ్ ఇంటర్వూ తీసుకొని మరింత క్రేజ్ సంపాదించుకుంది...
బిగ్ బాస్ ముగిసాక గీతు రాయల్ ని ఇంటర్వూ చేయగా కొన్ని సంచలన వ్యాఖ్యలు చేసింది. పంతొమ్మిది కంటెస్టెంట్స్ అంత ఇబ్బంది పెట్టారా అని యాంకర్ అడుగగా.. లేదు బయటకొచ్చాక జనాలు చిరాకు తెప్పించారని సమాధనమిచ్చింది. ఈ సీజన్ కి బజ్ ఇంటర్వూ చేశారు కదా, ఎలా ఉంది మీ అనుభవం అని అడుగగా.. ఏం ఉంది కొన్ని నియమ నిబంధనల మధ్య ఇంటర్వూ చేశానని అంది. ఏ ఎందుకలా అని అడుగగా.. సీజన్-4, సీజన్-5 లకి రివ్యూ ఇచ్చాను కాబట్టి నాకు నచ్చినట్టుగా నేను మాట్లాడేదాన్ని కానీ ఇలా ఒక షోకి ఇంటర్వూ చేయడం ఇదే తొలిసారి కాబట్టి కాస్త ఇబ్బందిగానే ఉంటుందని అంది. నాగార్జున హోస్ట్ ఎలా అనిపించిందని అనగా..అన్నీ సీజన్లతో పోలిస్తే ఈ సీజన్ కాస్త బాగుందనిపించింది. అయితే సీజన్ - 4 లో షన్ను, సోహెల్ మధ్య జరిగిన గొడవ అసలు చూడకుండానే సోహెల్ దే అన్నట్టు వీడియోని రెండు, మూడు సార్లు వేసి చూపించి తప్పు లేకపోయిన ఒప్పించాలని ప్రయత్నించారు. అదంతా స్క్రిప్ట్ అని తర్వాత తెలిసింది. అది హోస్ట్ గా సర్ కి ఉండే భాద్యత అలాంటిదని గీతు అంది. మా సీజన్ లో కూడా చంటి గారితో జరిగిన గొడవలో నా తప్పు ఏం లేకపోయిన నాదే తప్పు అన్నట్టు ఒప్పించడానికి చాలా ప్రయత్నించారు. అసలు హౌస్ లో జరిగింది మొత్తం సర్ చూడడని, చూసేంత టైమ్ సర్ కి ఉండదని తర్వాతే తెలిసిందని గీతు అంది.
హౌస్ మేట్స్ లో ఎవరు స్ట్రాంగ్ కంటెస్టెంట్ అని మీ ఫీలింగ్ అని అడుగగా.. శివాజీ గారికి ఒక్కరికే ఆ ట్యాలెంట్ ఉంది. ఎందుకంటే అతని తప్పు ఉన్నా డిఫెండ్ చేసుకోగలడు. ఇక మిగిలిన వాళ్ళు వారి తప్పు లేకపోయిన సరిగ్గా డిఫెండ్ చేసుకోలేక ఇబ్బంది పడ్డారని గీతు చెప్పుకొచ్చింది. ఇక తన ఎలిమినేషన్ నమ్మలేకపోయినట్టుగా అంది. " అసలు వారం రోజుల దాకా అదే ట్రాన్స్ లో ఉన్నాను. ఏదో సీక్రెట్ రూమ్ కి పంపిస్తారేమోనని అనుకున్నాను. కానీ ఇంటికొచ్చాక తెలసింది.. అయ్యో ఎలిమినేషన్ అయ్యానా అని చాలా ఏడ్చాను. ఆ తర్వాతే నాకు తెలిసింది. ఈ క్షణం ఎంజాయ్ చేయాలి. ఆ తర్వాత ఉంటామో ఉండమో అనిపించింది. బ్రో సినిమా చూసాకే తెలిసింది. జీవితంలో ఎప్పుడు ఏదైనా జరగొచ్చని, రేపటి కోసం దాచుకోవడం వృధా అని, ఈ రోజు హ్యాపీగా ఉండాలని అనుకుంటున్నాను " అంటూ గీతు రాయల్ జీవిత సత్యాన్ని చెప్పుకొచ్చింది.