English | Telugu
హీరోయిన్ గా ఛాన్స్ వస్తే చేస్తానంటున్న బిగ్ బాస్ కంటెస్టెంట్!
Updated : Dec 26, 2023
స్క్రీన్ మీద కనపడాలని, ఒక చిన్న పాత్ర అయిన చాలు అని ఎంతోమంది వెండి తెర తారలు, బుల్లితెర తారలు, నటీనటులు ఎదురుచూస్తుంటారు. దానికోసం ఎంతగానో శ్రమిస్తుంటారు. ఇలా సినిమా పరిశ్రమలో నిలదొక్కుకోవాలని ఎక్కడెక్కడి నుంచో ఇండస్ట్రీకి వస్తుంటారు. అయితే కామెడీ ప్లాట్ ఫామ్ నుండి సినిమాలలోకి వచ్చిన వాళ్ళు చాలా అరుదు.. తాజాగా సేవ్ ది టైగర్స్ వెబ్ సిరీస్ లో రోహిణి, జోర్దార్ సుజాత నటించి మెప్పించారు. ఇప్పుడు ఇదే కోవలోకి ఫైమా చేరనుంది. త్వరలో తను హీరోయిన్ అవ్వాలని అనుకుంటుందట. బిగ్ బాస్ సీజన్ సిక్స్ లో ఫైమా కామెడీకి ఒక సపరేట్ బేస్ ఉంది. పటాస్ షోతో ఎంతో పాపులారిటి తెచ్చుకున్న ఫైమా.. హౌస్ లో రాజ్, ఇనయా, ఆరోహీతో కలిసి ఎక్కువగా ఉండేది.
పటాస్ షో ద్వారా ఇండస్ట్రీకి పరిచయమైన ఫైమా.. తనదైన టైమింగ్ తో తక్కువ టైమ్ లోనే ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకుంది. ఆ గుర్తింపుతోనే బిగ్ బాస్ లో కూడా అడుగుపెట్టింది. హౌస్ లో పది వారాల పాటు ఆడియన్స్ కు అద్భుతమైన ఎంటర్‌టైన్మెంట్ ని పంచింది. బిగ్ బాస్ హౌస్ లో ఉన్నప్పుడు తమకి ఏమీ లేదని, కట్టెలు తీసుకురావడానికి మమ్మల్ని అడవికి తీసుకెళ్ళేదని ఫైమా చెప్పడంతో అందరు కనెక్ట్ అయ్యారు. ఇక గెలిస్తే తమకంటూ ఒక సొంతిల్లు కొనుక్కోవాలని అనుకుందంట. హౌస్ లో ఉన్నప్పుడు చెప్పినట్టుగానే ఫైమా ఆ కలను నెరవేర్చి కొత్త ఇంట్లోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది. దీనికి సంబంధించిన వీడియోను అప్పట్లో తన యూట్యూబ్ ఛానల్ లో అప్లోడ్ చేసి.. తన ఆనందాన్ని అభిమానులతో పంచుకుంది. అంతేకాదు త్వరలోనే జబర్దస్త్ లోకి రీ ఎంట్రీ ఇస్తున్నట్లుగా కూడా ఈ వీడియోలో చెప్పుకొచ్చింది ఫైమా.
అయితే ఇన్ స్టాగ్రామ్ లో ఎప్పటికప్పుడు తన ఫోటోలని, రీల్స్ ని అప్లోడ్ చేస్తూ ఫ్యాన్స్ కి దగ్గరగా ఉంటు వస్తోంది ఫైమా. అయితే తాజాగా ఆస్క్ మి క్వశ్చనింగ్ స్టార్ట్ చేసింది ఫైమా. ఇందులో ఒక్కో అభిమాని ఒక్కోలా ప్రశ్నలు వేస్తుంటే వాటికి సమాధానాన్ని తెలియజేసింది. మీ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ఎక్కడ అని ఒకరు అడుగగా.. నేను ప్రతీ సంవత్సరం న్యూ ఇయర్ కి ఏం ప్లాన్ చేయలేదు. పెద్దగా అవసరం లేదు. ఎందుకంటే ఆ రోజు కచ్చితంగా ఏదో ఒక ఈవెంట్ షూటింగ్ ఉంటుందని ఫైమా రిప్లై ఇచ్చింది. హీరోయిన్ గా అవ్వాలని అనుకున్నారా ఎప్పుడైనా అని ఒకరు అడుగగా.. అవును అనుకున్నాను. ఫ్రెండ్ క్యారెక్టర్, అతిథి పాత్ర, సైడ్ క్యారెక్టర్ ఇలా ఒకటి రెండు నిమిషాలు ఇలా వచ్చి అలా వెళ్ళే పాత్రని చేయాలని అనుకోవట్లేదు. లైఫ్ లాంగ్ అందరికి గుర్తుండిపోయే పాత్రని చేయాలని అనుకున్నానంటూ ఫైమా చెప్పింది. ఇలాగే తన ఈవెంట్ బిజీ షెడ్యూల్ గురించి ఎప్పటికప్పుడు తన అభిమానులతో షేర్ చేసుకుంటుంది ఫైమా. కాగా ఇప్పుడు తనకి హీరోయిన్ గా ఛాన్స్ రావాలని చాలామంది అభిమానులు కోరుకుంటున్నారంట. అయితే మంచి అవకాశం వస్తే తప్పకుండా చేస్తానని తన అభిప్రాయాన్ని ఫైమా నెటిజన్లతో పంచుకుంది.