English | Telugu
దేవుడికి భక్తుడు భజనే చేస్తాడు అంతకుమించి ఏం చేయలేడు!
Updated : Oct 26, 2022
"ఎక్స్ట్రా జబర్దస్త్" ఈ వారం మంచి పంచ్ డైలాగ్స్ తో ఎంటర్టైన్ చేయడానికి రెడీ అయ్యింది. దీనికి సంబంధించిన ప్రోమో ఇప్పుడు రిలీజ్ అయింది. ఇందులో గెటప్ శీను గ్యాంగ్ "గాడ్ ఫాదర్" మూవీ స్పూఫ్ చేశారు. చిరంజీవిగా శీను, సత్యదేవ్ గా ఆటో రాంప్రసాద్, నయనతారగా అన్నపూర్ణ , సల్మాన్ ఖాన్ గా బులెట్ భాస్కర్ ఈ స్కిట్ లో నటించారు. "కామెడీకి దూరంగా ఉన్న మీరు మళ్ళీ ఇక్కడికెందుకు వచ్చారు" అని రాంప్రసాద్ శీనుని సీరియస్ గా అడిగేసరికి " నేను రానంతవరకు ఆ కామెడీని చెరిగి చెదపట్టనివ్వను" అని చిరు లెవెల్ లో డైలాగ్ చెప్పాడు.
వెంటనే అన్నపూర్ణ లైన్ లోకి వచ్చి "చెద పట్టదన్నయ్యా అప్పుడప్పుడు వీడు చెదలమందు కొడుతున్నాడు" అని చెప్పేసరికి "నా చిట్టి చెల్లి" అని కౌంటర్ డైలాగ్ వేసాడు శీను. "చూడు బ్రహ్మ నీకేం కావాలి అంటే అది ఇస్తాను నీ సపోర్ట్ నాకు కావలి" అని రాంప్రసాద్ శీనుకి చెప్పాడు "నా సపోర్ట్ లేనిదే నువ్వు ఇంతదూరం వచ్చావా" అని కౌంటర్ వేసాడు శీను.
ఇలా ఈ టీం స్కిట్ వేశారు. ఇక శీను వేసిన చిరు గెటప్ చూసి "నిజంగా చిరంజీవిని చూసినట్టే ఉంది" అని ఖుష్భూ శీనుకి కాంప్లిమెంట్ ఇచ్చింది. తర్వాత రాంప్రసాద్ మాట్లాడుతూ "చిరంజీవి గారితో శీను ప్రైవేట్ జెట్ లో వెళ్ళినప్పుడు నిజంగా మా జబర్దస్త్ ఫామిలీ మొత్తం వెళ్ళినట్లే అనిపించింది" అన్నాడు. తర్వాత శీను మాట్లాడుతూ "నేను ప్రతీసారి మెగాస్టార్ గారి గురించి చెప్తే భజన భజన అంటూ ఎగతాళి చేస్తున్నారు. దేవుడికి భక్తుడు భజనే చేస్తాడు అంతకుమించి ఏమీ చేయడు" అని చెప్పి నెగటివ్ కామెంట్స్ చేసేవాళ్ళ నోరు మూయించాడు.