English | Telugu
గీతు, రోహిత్ మధ్య వాగ్వాదం!
Updated : Oct 26, 2022
బిగ్ బాస్ లో మంగళవారం జరిగిన కెప్టెన్సీ కంటెండర్ పోటీ టాస్క్ లో కంటెస్టెంట్స్ మధ్య గొడవలు జరిగాయి. అందులో గీతు, రోహిత్ మధ్య జరిగిన గొడవ పీక్స్ స్టేజ్ కి వెళ్ళింది.
"గేమ్ ని గేమ్ లా ఆడాలి. నిజం చెప్పడానికైన, గేమ్ ఆడటానికైనా గట్స్ ఉండాలి" అని గీతు అంది. దానికి రోహిత్ " దా గట్స్ ఉంటే వచ్చి తీసుకో" అన్నాడు. టాస్క్ మొదలవగానే చేపల వర్షం కురవగా, ఒక్కో కంటెస్టెంట్ చేపలను పట్టుకొని బుట్టలో వేసుకున్నారు. అయితే వాటిని లాక్కొని దాచుకోవాలి. కానీ రోహిత్, తన భార్య మెరీనాకు సపోర్ట్ చేసాడు. ఇది చూసిన గీతుకి కోపం వచ్చి, "ఏంటి రోహిత్ టాస్క్ గురించి క్లారిటీ లేదా నీకు. మెరీనాకు ఎందుకు సపోర్ట్ చేస్తున్నావ్. కలిసి ఆడమన్నప్పుడు ఆడరు. విడిపోయి ఆడమన్నప్పుడు కలిసి ఆడుతున్నారు." అని గీతు, రోహిత్ తో చెప్పుకొచ్చింది.
రోహిత్ మాట్లాడుతూ, "నా భార్య నా ఇష్టం. నేను సపోర్ట్ చేస్తా , నీకేంటి" అని అన్నాడు. "దమ్ముంటే గీతులాగా ఆడాలి. గీతులా ఆడాలంటే గట్స్ ఉండాలే. మీలా కాదు నేను" అంటూ గీతు చెప్పింది రోహిత్ తో. ఇలా ఇద్దరి మధ్య కాస్త వాగ్వాదం జరిగింది. ఆ తర్వాత హౌస్ మేట్స్ చేపలు పట్టడం లో బిజీ అయిపోయారు. టాస్క్ ముగిసే సమాయానికి ఒక్కొక్కరుగా అందరూ బాగానే పర్ఫామెన్స్ ఇచ్చారు. ప్రేక్షకులు సరదగా నవ్వుకోవచ్చు.