English | Telugu
వాళ్ళిద్దరు ఒక్కటయ్యారు.. ఆమె నుదుటిపై ముద్దు పెడుతూ!
Updated : Oct 24, 2024
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ' ఎటో వెళ్లిపోయింది మనసు'(Eto Vellipoyindhi Manasu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -234 లో.....సీతాకాంత్ ఇంటికి వస్తుంటాడు. రామలక్ష్మి ఫోన్ చేస్తే సీతాకాంత్ ఫోన్ కల్వకపోవడంతో రామలక్ష్మి టెన్షన్ పడుతూ.. సీతాకాంత్ కోసం వెతుక్కుంటూ వస్తుంది. మరొకవైపు అభి సీతాకాంత్ ని చంపడానికి కత్తితో వస్తాడు. సీతాకాంత్ కార్ ఆగిపోతుంది. కార్ దిగి ఏమైందోనని సీతాకాంత్ చూస్తుంటాడు. అభి తన వెనకాల కత్తితో వస్తాడు. అప్పుడే సీతాకాంత్ దగ్గరికి రామలక్ష్మి వచ్చి.. ఏమైందంటూ అడిగి తనని ఇంటికి తీసుకొని వెళ్తుంది.
ఏంటి ప్లాన్ ఫెయిల్ అయిందని అభి డిస్సపాయింట్ అవుతాడు. సీతాకాంత్ ని రామలక్ష్మి ఇంటికి తీసుకొని వెళ్లి పడుకోపెడుతుంది. రామలక్ష్మిని సీతాకాంత్ ప్రేమగా దగ్గరికి తీసుకుంటాడు. మరుసటి రోజు ఉదయం రామలక్ష్మి నిద్రలేచి సిగ్గు పడుతూ.. సీతాకాంత్ నుదుటిపై ముద్దు పెడుతుంది. తను లేచి స్నానం చేసి దేవుడిని మొక్కుకుంటుంది. నాకు జీవితం లో సంతోషం ఉండదనుకున్నా కానీ ఇప్పుడు నాకు చాలా హ్యాపీగా ఉందంటు మొక్కుకుంటుంది. ఆ తర్వాత సుజాతని రామలక్ష్మి పిలిచి సిగ్గుపడుతుంది. దాంతో సుజాత అర్థం చేసుకొని హ్యాపీగా ఫీల్ అవుతుంది. నువ్వు ఇలా సంతోషంగా ఉండాలనుకున్నానని అంటుంది. ఆ తర్వాత రామలక్ష్మి సీతాకాంత్ ని నిద్ర లేపి.. వెళ్లి స్నానం చేసి రండి అని అంటుంది. సీతాకాంత్ రాత్రి గురించి ఏదైనా చెప్తాడోనని అనుకుంటుంది కానీ సీతాకాంత్ కి అసలేం గుర్తుండదు. సీతాకాంత్ స్నానం చేసి రాగానే తన తల తుడుస్తూ ప్రేమగా ఉంటుంది రామలక్ష్మి.
రామలక్ష్మి మొన్న ఎలా ఉంది.. ఇప్పుడు ఇలా ఉంది.. ఎందుకు వాళ్ళ నాన్నని కోప్పడినందుకు అలా ఉందా.. ఇప్పుడు వీళ్ళింటికి వచ్చానని ఇలా ఉందా.. ఏదోలే తను హ్యాపీగా ఉందని సీతాకాంత్ అనుకుంటాడు. ఆ తర్వాత మాణిక్యం, సుజాతలు వాళ్లకి బట్టలు పెడతారు. మరొకవైపు శ్రీవల్లి, శ్రీలత, సందీప్ లకి బట్టలు తీసుకొని వస్తుంది. ఏంటి ఇలా చీప్ గా తీసుకొని వచ్చావంటూ శ్రీలత సందీప్ లు తిడతారు. మరొకవైపు సీతాకాంత్ బట్టలు మార్చుకుంటుంటే.. రామలక్ష్మి వెనకాల వైపు తిరిగి ఉంటుంది. అప్పుడే పింకీ బల్లి సీతాకాంత్ పై వెయ్యడంతో రామలక్ష్మిని పట్టుకుంటాడు. అప్పుడే అందరు వస్తారు. పింకీ ఆటపట్టించిందని తెలిసి పింకీతో సరదాగా మాట్లాడతాడు సీతాకాంత్. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.