English | Telugu

Eto Vellipoyindhi Manasu : భర్తని కత్తితో పొడిచిందవరు?

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ' ఎటో వెళ్లిపోయింది మనసు'(Eto Vellipoyindhi Manasu). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -200 లో.....రామలక్ష్మి నిద్రపోతుంటే తన చేతికి పెట్టిన గోరింటాకునే చూస్తుంటాడు సీతాకాంత్. తన చేతులు పండాయో లేదో ఎలా తెలుస్తుందని అనుకొని రామలక్ష్మిని నిద్రలేపి వెళ్లి కాఫీ తీసుకొని రా అంటాడు. రామలక్ష్మి అలాగే వెళ్తుంటే చేతులు కడుక్కొని వెళ్ళమని అంటాడు. చేతులు కడుక్కొని గోరింటాకు సీతాకాంత్ కి చూపించకుండా రామలక్ష్మి ఆడుకుంటుంది. కాఫీ ఎప్పటిలాగా కాకుండా ట్రేలో తెస్తుంది. చేతులు చూపించమంటే చూపించదు. అప్పుడే సిరి వచ్చి.. వదిన నీ గోరింటాకు పడిందో లేదో చూపించమని అడుగుతుంది.

ఆ తర్వాత రామలక్ష్మి చూపిస్తుంది. గోరింటాకు బాగా పండుతుంది. దాన్ని చూసి సీతాకాంత్ హ్యాపీగా ఫీల్ అవుతు.. నేనంటే కుడా రామలక్ష్మికి ఇష్టమే అని అనుకుంటాడు. మీరిద్దరికి ఒకరంటే ఒకరికి ఇష్టమని సిరి అంటుంది. మరొకవైపు సందీప్ తనతో మాట్లాడిన విషయాన్ని నందిని గుర్తు చేసుకుంటుంది. ఇదంతా చూస్తుంటే సీతాకాంత్ ని తప్పించి తను ఆఫీస్ చైర్మన్ అవ్వాలని సందీప్ అనుకుంటున్నాడని నందిని అర్ధం చేసుకుంటుంది. అప్పుడే హారిక వచ్చి రామలక్ష్మి వచ్చిందని చెప్తుంది. రామలక్ష్మి నందిని దగ్గరికి వస్తుంది. నేను నిన్ను చూడడానికి రాలేదు సారీ అని చెప్తుంది. అయ్యో అలా అనకండి అని రామలక్ష్మి నందిని, హారికలకి బొట్టు పెట్టి యాగానికి ఆహ్వానిస్తుంది. నీ చేతికి గోరింటాకు బాగా పండింది. ఎవరు పెట్టారని నందిని అడుగుతుంది. మా ఆయన పెట్టానని రామలక్ష్మి అంటుంది. నిన్ను ప్రేమ గా చూసుకునే భర్త దొరికాడు అన్నమాట అని నందిని అంటుంది. నువ్వు యాగానికి వస్తే నీ చిరకాల వాంఛ నెరవేరుతుంది. నువ్వు కోరుకున్న వాడితో నీ పెళ్లి జరుగుతుందని రామలక్ష్మి చెప్పి వెళ్ళిపోతుంది. యాగానికి వెళ్తావా అని హారిక అడుగగా.. వెళ్తానని నందిని అంటుంది. ఎందుకు సీతాకాంత్ తో మాటలు పడతావని హారిక అంటుంది. అనేది నా సీతానే కదా... అయిన రామలక్ష్మి పిలిచినందుకు కాదు కోరుకున్న వాడితో పెళ్లి జరుగుతుందని అంది కదా అని నందిని అంటుంది. రామలక్ష్మి పైన బట్టలు తీస్తుంటే తన చేతికి దెబ్బ తాకుతుంది. అప్పుడే సీతాకాంత్ వచ్చి ఎన్నిసార్లు చెప్పాలి.. నువ్వు ఇలాంటివి చెయ్యకని సీరియస్ అవుతాడు.

ఆ తర్వాత రామలక్ష్మి చెప్పింది వినట్లేదని సీతాకాంత్ అలుగుతాడు. దాంతో సీతాకాంత్ ని రామలక్ష్మి బుజ్జగిస్తుంది. ఆ తర్వాత సీతాకాంత్ ఉన్నాడనుకొని తన ప్రేమ విషయం రామలక్ష్మి చెప్తుంది కానీ సీతాకాంత్ ఉండడు. ఆ తర్వాత రామలక్ష్మి నిద్రపోతు సీతాకాంత్ ని ఎవరో కత్తితో పొడిచినట్లు కల కంటుంది. ఒక్కసారిగా ఏవండి అంటూ నిద్ర లేస్తుంది. దాంతో ఏమైందని సీతాకాంత్ అడుగుతాడు. తనతో చెప్తే కంగారు పడతాడని రామలక్ష్మి చెప్పదు. ఆ తర్వాత దేవుడికి మొక్కుతు ఉంటుంది. మరుసటి రోజు రామలక్ష్మి కల గురించి భయపడుతూ.. వాళ్ళ అమ్మకి ఫోన్ చేసి.. అది నిజం అవుతుందేమోనని భయంగా ఉందని అంటుంది. అదేం కాదు అల్లుడు గారు మంచి వారు.. అలాంటి బయలు పెట్టుకోకని సుజాత చెప్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Karthika Deepam2 : దీప అమ్మానాన్నలు గొప్పొళ్ళు.. నోరు జారిన జ్యోత్స్న!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -537లో.. శివన్నారాయణ ఇంటికి శ్రీధర్ వస్తాడు. పారిజాతం కాఫీ తీసుకొని వస్తుంది. తనని చూసి మీరేంటి అత్తయ్య కాఫీ తీసుకొని వచ్చారని శ్రీధర్ అడుగుతాడు. ఈ ఒక్క రోజు దీప డ్యూటీ తనకి వచ్చిందని కార్తీక్ అంటాడు. అది తర్వాత గానీ ముందు ప్రెజెంటేషన్ ఇవ్వమని శివన్నారాయణ అనగానే శ్రీధర్, కాశీకీ ఫోన్, లాప్ టాప్ తీసుకొని రమ్మని చెప్తాడు. కాశీ వచ్చి సర్ అని శ్రీధర్ ని పిలుస్తుంటే.. ఏంటి వాడిని నీ చుట్టూ తిప్పుకుంటున్నావని పారిజాతం అంటుంది.

Illu illalu pillalu : పార్క్ కి రమ్మని అమూల్యకి లెటర్ రాసిన విశ్వ.. అందరూ చూసేసారుగా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -338 లో. అమూల్యని ఎలాగైనా ఒప్పించి పెళ్లి చేసుకోవాలని విశ్వ అనుకుంటాడు. అమూల్యని పిలుస్తాడు. తనకి విశ్వ ఏం చెప్తున్నాడో ఏం అర్థం కాదు.. దాంతో విశ్వ ఒక పేపర్ పై ఈ రోజు సాయంత్రం పార్క్ లో కలుద్దామని రాసి అమూల్యకి విసిరేస్తాడు. అది అమూల్య చూసి ఒకే అంటుంది. ఆ పేపర్ ని పక్కన విసిరేస్తుంది. అది చందు చూసి చుట్టూ పక్కన ఎవరు ఉన్నారని చూడగా.. బట్టలు ఆరెస్తూ శ్రీవల్లి కనిపిస్తుంది. శ్రీవల్లి రాసిందనుకొని తన వైపుకి మళ్ళీ విసురుతాడు.