English | Telugu
రీతూ, భరణిలని నామినేట్ చేసిన ఇమ్మాన్యుయేల్!
Updated : Nov 18, 2025
బిగ్ బాస్ సీజన్-9 లో పదోవారం డబుల్ ఎలిమినేషన్ జరిగింది. ఇందులో నిఖిల్, గౌరవ్ ఇద్దరు ఎలిమినేట్ అయ్యారు. ఇక పదకొండవ వారం నామినేషన్ల ప్రక్రియ మొదలైంది. ఇందులో హౌస్ లోని కంటెస్టెంట్స్ మధ్య హీటెడ్ ఆర్గుమెంట్స్ జరిగాయి. నిన్నటి ఎపిసోడ్ లో ఏం జరిగిందో ఓసారి చూసేద్దాం.
ప్రతీ సీజన్ లో లాగే ఈ సీజన్ లో కూడా కుండపగులగొట్టే నామినేషన్ ఇచ్చాడు బిగ్ బాస్. కంటెస్టెంట్స్ కి టైమ్ లిమిట్ ఉంటుంది. బజర్ నుండి బజర్ వరకు నామినేషన్ అండ్ ఢిఫెండ్ ఉన్నాలని బిగ్ బాస్ చెప్పాడు.ఇక కెప్టెన్ గా ఉన్న తనూజకి కొన్ని టోకెన్లు ఇచ్చాడు బిగ్ బాస్. అందులో ఇద్దరిని నామినేట్ చేయడానికి 'రెండు' అని ఉన్న టోకెన్ ని ఇమ్మాన్యుయల్ కి ఇచ్చింది తనూజ. రీతూని ఇమ్మాన్యుయల్ నామినేషన్ చేశాడు. తన గేమ్ తక్కువ అనిపించిందని ఇమ్మాన్యుయల్ రీజన్ చెప్పాడు. నేనెక్కడో ఆడలేదో చూపించు అంటు రీతూ డిఫెండ్ చేసుకుంది. ఇద్దరి మధ్య వాదన జరిగింది.
ఆ తర్వాత భరణిని ఇమ్మాన్యుయల్ నామినేషన్ చేశాడు. నీ హెల్త్ బాలేదు..కానీ గౌరవ్, నువ్వు ఉన్నప్పుడు.. అంత కాన్ఫిడెంట్ గా గేమ్ ఆడలేదని నాకు అనిపించింది అందుకే నామినేట్ చేస్తున్నానని ఇమ్మాన్యుయల్ అన్నాడు. నా ఆరోగ్యం బాలేకపోయినా నేను గేమ్ ఆడానని భరణి అన్నాడు. నీ ఆరోగ్య రిత్యా ఎఫర్ట్స్ పెట్టలేకపోతున్నావ్ అన్న.. పార్టిసిపేట్ చేశారు కానీ మీ వల్లే ఆ టాస్క్ ఓడిపోయారని ఇమ్మాన్యుయల్ అనగా.. గౌరవ్ నా కన్నా ఫిట్ గా ఉన్నాడు. కానీ నా వల్ల బ్యాక్ స్టెప్ తీసుకోలేదు.. ప్రతీ టాస్క్ వంద శాతం ఎఫర్ట్స్ పెట్టి ఆడానని భరణి అంటాడు. మీ గేమ్ లో కాన్ఫిడెన్స్ తగ్గిందని ఇమ్మాన్యుయల్ అన్నాడు.
ఆ తర్వాత కళ్యాణ్ ని డీమాన్ పవన్ నామినేషన్ చేశాడు. బ్యాక్ స్టాపింగ్ చేశావ్.. నా గురించి నువ్వు స్టాండ్ తీసుకోలేదని రీజన్ చెప్పి కళ్యాణ్ ని డీమాన్ నామినేట్ చేశాడు.