English | Telugu

చిరంజీవి కొరియోగ్రఫీ చేసిన పాట ఏదో తెలుసా?

ఝాన్సీ అంటే నిన్న మొన్నటి వరకు ఎవరికీ తెలీదు. కానీ ఇప్పుడు కండక్టర్ ఝాన్సీ అంటే చాలు ఆమె డాన్స్ గుర్తొస్తుంది. శ్రీదేవి డ్రామా కంపెనీ గురుస్తోంది. ఎందుకంటే పల్సర్ బైక్ సాంగ్ కి శ్రీదేవి డ్రామా కంపెనీలో చేసిన పెర్ఫార్మెన్స్ తో ఓవర్ నైట్ డాన్స్ స్టార్ ఐపోయింది కండక్టర్ ఝాన్సీ. ఇప్పుడామె ఒక చిన్న సెలెబ్రిటీ ఐపోయేసరికి సోషల్ మీడియా కూడా ఆమె ఇంటర్వ్యూలు తీసుకోవడానికి ఆసక్తి చూపిస్తోంది. అలా ఆమె ఒక ఇంటర్వ్యూ లో ఎన్నో ఆసక్తికర విషయాలను చెప్పింది.

"నా ఫస్ట్ పెర్ఫామెన్స్ జీ తెలుగులో ఇచ్చాను. తర్వాత జెమినీ డ్యాన్సింగ్ స్టార్స్ లో చేసాను.. అందులో మా రమేష్ మాస్టర్ కోరియోగ్రఫీ చేశారు. అప్పుడు నాకు ఫస్ట్ ప్లేస్ వచ్చింది. చిరంజీవి గారి చేతి మీదుగా నేను 5 లక్షల ప్రైజ్ మనీ అందుకున్నాను. తర్వాత మా టీవీ రంగం-2 రన్నరప్ గా నిలిచాను. చాలా హ్యాపీ అనిపించింది. చిరంజీవి గారి డాన్స్ చూస్తూ పెరిగి ఆ డాన్స్ లు చేసి పేరు తెచ్చుకున్నాను. ఆయన ముందు ఒక రెండు స్టెప్పులు వేసి ఇంకా డాన్స్ ఆపేద్దామని అనుకున్నా. కానీ ఆయన నాకు చేతికి చెక్ ఇచ్చి భుజం మీద చేయి వేసి ఆర్టీసీ కండక్టర్ గా కష్టపడుతూ డాన్స్ చేసి అందరినీ మెప్పిస్తున్నావ్. నువ్వు నీ డాన్స్ ని ఆపొద్దు. కంటిన్యూ చెయ్యి అన్నారు. తర్వాత ఆయన నటించిన మూవీస్ లో ఏ పాట అంటే ఇష్టం అని అడిగేసరికి అభిలాషలో 'సందెపొద్దుల కాడ' అని నేను చెప్పాను. ఆ సాంగ్ కి చిరంజీవి గారే తన సొంతంగా కోరియోగ్రఫీ చేసుకున్నారట.. ఇలా ఆ విషయాన్ని నాతో షేర్ చేసుకోవడం నిజంగా నా అదృష్టం" అని ఝాన్సీ ఒక ఇంటర్వ్యూలో ఇంటరెస్టింగ్ విషయాలు చెప్పింది.