English | Telugu
'ఆర్ఆర్ఆర్' మూవీపై జబర్దస్త్ లో ఆది సెటైర్లు!
Updated : Sep 18, 2022
తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవసరం లేని పేరు హైపర్ ఆది. జబర్దస్త్ కార్యక్రమం ద్వారా ఎంతో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఆది బుల్లితెర ఈవెంట్స్ లో నటిస్తూ సందడి చేస్తూ ఉంటాడు. ఇక ఇప్పుడు చాలా రోజుల తర్వాత వైట్ అండ్ వైట్ డ్రెస్ లో జబర్దస్త్ షోలోకి ఎంట్రీ ఇచ్చాడు. ఇవ్వడంతోనే బులెట్ సాంగ్ కి రష్మితో కలిసి డాన్స్ చేసాడు. "మీరు నేను మాట్లాడుకుంటే పంచ్ పంచ్ పలకరించుకున్నట్టు ఉంటుంది" అని కృష్ణభగవాన్ మీద డైలాగ్ వేసాడు . "హాయ్ ఆది గారు మీకోసం పదేళ్లయినా వెయిట్ చేయొచ్చు" అని ఇంద్రజ అనేసరికి "అంటే మరో పదేళ్లు ఆవిడే జడ్జిగా ఉంటానని హింట్ ఇస్తున్నారు" అంటూ పంచ్ వేసాడు ఆది. "నాకు తెలిసి ఈ మధ్య కాలంలో రెండే రెండు చోట్ల చాలా మార్పులు జరిగాయి. ఒకటి ఇండియన్ క్రికెట్ టీమ్ కెప్టెన్లు, రెండు జబర్దస్త్ షోలో జడ్జిలు.. అబ్బో ఎంత మంది మారారో" అంటాడు ఆది. ఇక ఈ స్కిట్ లో రాజమౌళి డైరెక్షన్ లో తెరకెక్కిన ఆర్ఆర్ఆర్ మూవీపై సెటైర్లు వేశారు. "అసలు నువ్వా కొమ్మా ఉయ్యాల అనే పాట పడకుండా ఉంటే అసలు ఈ గొడవే ఉండేది కాదు" అని ఆ స్కిట్ లో పెర్ఫార్మ్ చేసిన పాపతో అంటాడు ఆది.