English | Telugu

నారాయణ గారు ఏ తప్పూ చేయలేదా.. అందరూ పత్తిత్తులేనా?

టాలీవుడ్ ఇండస్ట్రీలో శివాజీ రాజా గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర లేదు. ఒకటి రెండు కాదు.. 35 ఏళ్ళుగా ఇండస్ట్రీలో నటుడిగా, కారెక్టర్ ఆర్టిస్టుగా, హీరోగా, విలన్‌గా దాదాపు 400 సినిమాల్లో నటించాడు శివాజీ రాజా. తర్వాత మా అసోసియేషన్ ప్రెసిడెంట్‌గా పని చేసాడు. రెండేళ్ల క్రితం గుండెపోటు వచ్చేసరికి ఆయన అసలు బయటకు రావడమే మానేసాడు. ఐతే ఇటీవల ఆయన యూట్యూబ్ చానెల్స్ కి ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. ఇప్పుడు కూడా బిగ్ బాస్ షో గురించి నారాయణ కామెంట్స్ గురించి కొన్ని హీట్ పుట్టించే మాటలు మాట్లాడారు.

"నారాయణ అంటే చాలా గొప్ప వ్యక్తి అనుకున్నా. కానీ ఉదయం నోరు జారడం సాయంత్రమయ్యేసరికి సారీ చెప్పడం. ఎందుకు ఇదంతా? నారాయణ గారి లాంటి వాళ్ళు ఎంతోమందికి ఆదర్శప్రాయంగా ఉండాలి. ఐతే ఇండస్ట్రీలో అలాంటి కామెంట్స్ ని తిప్పి కొట్టే వాళ్ళు ఎవరూ లేకుండా పోయారు. సొల్లు కబుర్లు చెప్పేవాళ్ళు ఎక్కువయ్యారు. బిగ్ బాస్ అంటే మాటలు కాదు. వాళ్ళు ఎంతో మందిని ఫిల్టర్ చేస్తారు. ఎవరు ఎలా కష్టపడ్డారు, జీవితంలో ఎలా పైకి వచ్చారు అనే విషయాలేమి చూడకుండా వాళ్ళు బిగ్ బాస్ హౌస్ లోకి తీసుకోరు. అలా కష్టపడి పైకొచ్చి అలాంటి ప్లాట్ ఫారం పై కంటెస్టెంట్స్ నిలబడ్డారు అంటే అది చాలా గొప్ప విషయం. అలాంటి వాళ్ళను నారాయణ గారు ఇష్టమొచ్చినట్టుగా మాట్లాడ్డం సరికాదు. అందరూ పత్తిత్తులుగానే ఉంటారా? నారాయణ గారు ఏ తప్పు చేయలేదా? నేను ఏఐఎస్ ఎఫ్ నుంచి వచ్చాను. నాకూ అభ్యుదయ భావాలూ ఉన్నాయ్. కానీ నారాయణ గారికి నోటి దూల చాలా ఎక్కువ. అసలు ఈయనకు నాగార్జున మీద కోపమా, బిగ్ బాస్ మీద కోపమో తెలీదు. సిపిఐ పార్టీలో పెద్ద పదవిలో ఉన్న నారాయణ గారు ముందు బిగ్ బాస్ షో చూడడమే తప్పు. అసలు పార్టీ కార్యక్రమాలను పట్టించుకోకుండా బిగ్ బాస్ చూస్తున్నాడని కదా అర్ధం ..ఇంకో విషయం ఏమిటి అంటే పార్టీలో ఈయన్ని పక్కన బెట్టారు. ఏం చేయాలో అర్ధం కాక ఇలాంటి చెత్త కామెంట్స్ చేస్తున్నారు. ఇలాంటి నోటి దూల వాళ్ళు ఉంటే పార్టీకి చెడ్డ పేరు వచ్చేస్తుంది" అంటూ యాక్టర్ శివాజీ హాట్ హాట్ కామెంట్స్ చేశారు.

Brahmamudi Serial : దుగ్గిరాల కుటుంబం హ్యాపీ.. రుద్రాణి కన్నింగ్ ప్లాన్ అదేనా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ బ్రహ్మముడి (Brahmamudi). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్-931 లో.. మినిస్టర్ కి పాప పుడుతుంది. ఆపరేషన్ తర్వత డాక్టర్ బయటకు వస్తాడు. మీకు పాప పుట్టింది అని డాక్టర్ అనగానే.. మినిస్టర్ ఫుల్ హ్యాపీగా ఉంటాడు. కానీ పాపకి ఒక ప్రాబ్లమ్ ఉందని డాక్టర్ చెప్తాడు. ఏ ప్రాబ్లమ్ ఉన్నా ఆపరేషన్ చేయించండి.. ఎంతమంది డాక్టర్ లు ఐనా , ఎక్కడి నుంచి అయినా తీసుకొచ్చి అయినా ఆపరేషన్ చేపించండి అని మినిస్టర్ అనగానే.. ఇప్పుడు చేయకూడదు.. పాప వెయిట్ తక్కువ ఉంది.. పాప పెరిగాక ఆపరేషన్ చేయాలని డాక్టర్ చెప్తాడు. వాళ్ళిద్దరూ మాట్లాడుకునేదంతా రుద్రాణి చూస్తుంది.

Illu illalu pillalu Serial:  అమూల్య ఎంగేజ్ మెంట్ ఆపడానికి భద్రవతి ప్లాన్.. భాగ్యం ఏం చేయనుంది!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు (Illu illalu pillalu). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్-370 లో.. దేవుడా ఏ ఆటంకం లేకుండా ఈ నిశ్చితార్థం సవ్యంగా జరిగేలా చూడు అని దేవుడికి మొక్కుకుంటుంది వేదవతి. అప్పుడే దేవుడి దగ్గరున్న దీపాలు ఆరిపోతాయి. అయ్యో ఇదేంటి దీపాలు ఆరిపోయాయేంటని వేదవతి టెన్షన్ పడుతుంది. మరోవైపు కామాక్షి భర్త కోసం గుమ్మం దగ్గర ఎదురుచూస్తుంటుంది. అప్పుడే తిరుపతి చూస్తాడు. ఏంటమ్మా అని అడుగుతాడు. మా ఆయన కోసం ఎదురుచూస్తున్నానని కామాక్షి చెప్తుంది. అప్పుడే కామాక్షి భర్త ఆటోలో ఎంట్రీ ఇస్తాడు.

Illu illalu pillalu : అమూల్య ఎంగేజ్ మెంట్ కు ఏర్పాట్లు.. శ్రీవల్లి ప్లాన్ ఏంటి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు(Illu illalu pillalu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్-369 లో.. ప్రేమ అందంగా నగలతో రెడీ అవుతుంది. ఆ నగలు చూసి ధీరజ్ కోప్పడతాడు. ఆ నగల్ని చూస్తుంటే నాకు కంపరంగా ఉంది తీసెయ్ అని ధీరజ్ అనగానే.. మా అమ్మ ఈ నగల్ని ప్రేమతో ఇచ్చిందని ప్రేమ అంటుంది. మా నాన్న అవమానపడటానికి కారణం ఈ నగలే.. ఇవి నీ ఒంటి మీద కనపడటానికి వీల్లేదు తీసెయ్.. అని ధీరజ్ అనగానే ప్రేమ ఎమోషనల్ అవుతూ తీసేస్తుంది. మరోవైపు శ్రీవల్లి రెడీ అవ్వకుండా డల్ గా కూర్చుంటుంది. అప్పుడే ఆమె దగ్గరికి చందు వస్తాడు.