English | Telugu
ఆ కామెడీ షోకి పోటీగా ‘కామెడీ స్టాక్ ఎక్సేంజ్’
Updated : Oct 13, 2022
ఈటీవీ జబర్దస్త్ కి పోటీగా ఆహా ఓటీటీ వేదికగా ఒక కామెడీ షోని ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతోంది. జబర్దస్త్, ఎక్స్ట్రా జబర్దస్త్ తర్వాత మళ్ళీ అలాంటి కామెడీ షోస్ అనేవి బుల్లితెర మీద లేవనే చెప్పాలి. ఐతే జబర్దస్త్ పై వస్తున్న రూమర్స్ , ఒక్కొక్కరిగా వెళ్ళిపోతున్న వైనం చూస్తుంటే మరో కొత్త కామెడీ షో వస్తే బాగుంటుంది అని తెలుగు ఆడియన్స్ అనుకుంటున్నారు. మరి అలాంటి ఒక షో ఇప్పుడు రెడీ అవుతోందని చెప్పొచ్చు. ఇక ఇది "కామెడీ స్టాక్ ఎక్సేంజ్" అని టైటిల్ తో సుడిగాలి సుధీర్ ని ముందు పెట్టి ఈ షోని నిర్వహించేందుకు ఆహా టీం రెడీ అయ్యింది.
ఇక సోషల్ మీడియాలో దీనికి సంబంధించిన ప్రోమో చూస్తే ఫేమస్ కమెడియన్స్ అందరూ ఉన్నారు. ముక్కు అవినాష్, యాదమ్మ రాజు, సద్దాం, హరి, ఇంకా పలువురు జబర్దస్త్, పటాస్ కమెడియన్ ఈ కార్యక్రమంలో కనిపించబోతున్నారు. ఇక జడ్జిగా నాగబాబు వ్యవహరించే అవకాశం ఉన్నట్లు కనిపిస్తోంది. సుడిగాలి సుధీర్ ఫాన్స్ ఈ షో కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే డాన్స్ ఐకాన్ కార్యక్రమం ఆహాలో స్ట్రీమ్ అవుతోంది. ఈ ప్రోగ్రాం పూర్తయ్యే లోపు కామెడీ స్టాక్ ఎక్సేంజ్ కార్యక్రమం స్టార్ట్ అవుతుందని తెలుస్తోంది. ఆహా కొత్త కొత్త ప్రయోగాలను చేస్తూ ఓటిటితో ఫుల్ ఎంటర్టైన్మెంట్ అందిస్తోంది. డాన్స్ ఐకాన్ తో పాటు బాలయ్య అన్ స్టాపబుల్ సీజన్ 2 కూడా స్టార్ట్ అవబోతోంది. నెమ్మదిగా ఆహా కామెడీ జానర్ వైపు దృష్టి సారిస్తోందని దీన్ని బట్టి అర్ధమవుతోంది.