English | Telugu

పవన్ కళ్యాణ్ కి ‘ఐ లవ్ యు’ చెప్తా...చిరుతో కలిసి ఆయన ప్రైవేట్ జెట్ లో డేట్ కి వెళ్తా..

దివి బిగ్ బాస్ గ్లామర్ గర్ల్. బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళక ముందు దివి అంటే ఎవరో ఎవరికీ పెద్దగా తెలీదు కానీ హౌస్ లోకి వెళ్లి వచ్చాక ఫుల్ పాపులారిటీ వచ్చేసింది. సోషల్ మీడియాలో తన గ్లామర్ తో బాగా ఆకట్టుకుంటోంది. సినిమాలు, వెబ్ సిరీస్ లు వంటి వాటిల్లో అవకాశాలు అందిపుచ్చుకుంటోంది. గాడ్ ఫాదర్ సినిమాలో చిరుతో కలిసి నటించే అవకాశం కొట్టేసింది దివి. ఐతే ఇప్పుడు దివి ఒక ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో అడిగిన రాపిడ్ ఫైర్ క్వశ్చన్స్ కి గమ్మత్తుగా ఆన్సర్స్ ఇచ్చింది. "చిరుతో కలిసి ఆయన ప్రైవేట్ జెట్ లో డేట్ కి వెళ్లాలనుందట పాపకి. పవన్ కళ్యాణ్ అంటే పిచ్చి. ఆయన మేనరిజం, ఆయన స్టైల్ నాకు బాగా ఇష్టం.

ఒకవేళ ఆయన్ని కలిసే అవకాశం వస్తే "ఐ లవ్ యు సర్" అని చెప్తాను.. ఇక ఆయన సినిమాలో అవకాశం వస్తే కచ్చితంగా చేస్తాను" అని చెప్పింది దివి. ఇక తర్వాత ప్రభాస్ గురించి చెప్తూ "అవకాశం వస్తే పెళ్లి చేసుకుంటాను" అని చెప్పింది. తాను ఎంటెక్ చదివే రోజుల్లో ప్రభాస్ కి ఇన్స్టాగ్రామ్ లో ఆయన చూస్తారేమోనని ‘నేను మీతో కలిసి డేట్ కి వెళ్లాలని ఉంది’ అంటూ మెసేజ్ పెట్టిందట. కానీ ఆయన చూడలేదట. ఇక వెంకటేష్, అఖిల్ అక్కినేనితో అవకాశం వస్తే డేట్ కి వెళ్తానని చెప్పింది. రామ్ సింగల్ కాబట్టి పెళ్లి చేసుకుంటా అంటూ ఒక్కో స్టార్ గురించి తన అభిప్రాయాన్ని ఈ రాపిడ్ ఫైర్ లో చెప్పింది దివి.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.