English | Telugu
బిగ్‌బాస్ బ్యూటీ డైవర్స్ ఇచ్చినట్టేనా?
Updated : Jan 28, 2022
ఈ మధ్య ఎక్కడ విడాకుల పర్వం ఎక్కువైంది. ఎక్కడా చూసినా.. ఏ స్టార్‌ని కదిలించినా ఇదే న్యూస్ వినిపిస్తోంది. తాజాగా ఈ జాబితాలోకి బిగ్ బాస్ బ్యూటీ కూడా చేరినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. కొంత మంది ఎంత తొందరగా ప్రేమలో పడుతున్నారో అంతే త్వరగా పెళ్లి.. ఆ తరువాత విడాకులు అంటూ వార్తల్లో నిలుస్తున్నారు. ఇక ఇన్‌స్టా గ్రామ్ వేదికగా ఈ బ్రేకప్ వార్తలు మరీ ఎక్కువవుతున్నాయి. ఇటీవల నాగచైతన్య - సమంత ఇన్‌స్టా వేదికగా విడిపోతున్నట్టుగా ప్రకటించి షాకిచ్చారు.
Also Read:ఆ రూమర్స్ నమ్మకండి!
ఆ తరువాత కోలీవుడ్ జంట ధనుష్ - ఐశ్వర్య తమ దశాబ్దంన్నర వైవాహిక జీవితానికి ఫుల్ స్టాప్ పెడుతున్నట్టు ప్రకటించడం పలువురిని షాక్ కు గురిచేసింది. ఇక బిగ్ బాస్ జంటలు కూడా తమ లవ్‌కు బ్రేకప్ చెప్పేయడం, ఓ జంట నెట్టింట బ్రేకప్ తో వైరల్ కావడం తెలిసిందే. షణ్ముఖ్ - దీప్తి సునయన బ్రేకప్ చెప్పుకోవడం చర్చకు దారి తీసింది. ఇక వీరి దారిలోనే శ్రీహాన్ - సిరి కూడా తమ ప్రేమకు బ్రేకప్ చెప్పేసుకుంటారని ప్రచారం జరిగింది. బయటికి చెప్పకపోయినా వారిద్దరు మాత్రం ఇప్పటికీ కలిసి ఎలాంటి అప్‌డేట్ ఇవ్వడం లేదు.
Also Read:సమంతే విడాకులు కోరింది.. నాగార్జున సంచలన వ్యాఖ్యలు!
తాజాగా బిగ్ బాస్ ఫేమ్ హిమజ కూడా చేరిందని వార్తలు షికారు చేస్తున్నాయి. దీనికి కారణం ఆమె తన భర్తని నెట్టింట అన్‌ఫాలో చేయడమేనని అంటున్నారు. దీంతో వీరు విడిపోతున్నారని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. హిమజకు పెళ్లైందనే విషయం చాలా మందికి తెలియదు. బిగ్ బాస్ షోలో కానీ, తన వ్యక్తగత యూట్యూబ్ ఛానల్ లో కానీ హిమజ తనకు పెళ్లైందన్న విషయాన్ని వెల్లడించలేదు. హిమజకు 2010లో రాజేష్ ఆనంద్ అనే బిజినెస్‌మేన్‌తో పెళ్లైందని గూగుల్ సెర్చింగ్ లో కనిపిస్తోంది. అతనితో తను విడిపోయిందా? లేక గూగుల్ తప్పుగా చూపించిందా? అన్నది తెలియాల్సి వుంది. తాజాగా హిమజకు చల్లా విజయ్ రెడ్డితో వివాహం జరిగిందని అయితే వీరిద్దరు విడిపోతున్నారని ప్రస్తుతం నెట్టింట ఓ వార్త హల్ చల్ చేస్తోంది. ఇది ఎంతవరకు నిజమన్నది తెలియాలంటే హిమజ స్పందించాల్సిందే అంటున్నారు ఆమె ఫ్యాన్స్.